పునరావాసంపై సీఎం స్పష్టమైన ఆదేశాలు

20 Feb, 2020 16:43 IST|Sakshi

వివరాలు వెల్లడించిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావాసం,హెడ్‌ రెగ్యులరేటర్‌, టన్నెల్‌ తవ్వకాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. ప్రధానంగా పునరావాసంపై సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. (వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులు పరిశీలించిన సీఎం జగన్‌)

మొదటి విడత పనులకు కావాల్సిన నిధులు అవసరం గురించి అధికారుల నుంచి  సీఎం అడిగి తెలుసుకున్నారని..మొదటి దశ పనులు పూర్తి కావడానికి రూ.1880 కోట్లు అవసరం ఉందని అధికారులు తెలిపారని వెల్లడించారు. పెండింగ్‌ బిల్లులు గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరించారని చెప్పారు. మార్చి 31 వరకు రూ.184 కోట్లు అవసరమని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆగస్టు 31 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు