వైఎస్‌ జగన్‌ పాదయాత్రపై పుస్తకావిష్కరణ

12 Aug, 2019 13:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: చారిత్రాత్మక ‘ప్రజాసంకల్పయాత్ర’ పాదయాత్రపై రూపొందించిన జయహో పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌, ది ప్రింట్‌ ఎడిటర్‌ చీఫ్‌ పద్మభూషణ్‌ శేఖర్‌ గుప్తా చేతుల మీదుగా సోమవారం ఆవిష్కారం చేశారు. సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జయహో పుస్తకం సంకలనం చేయబడింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ ఎమెస్కో సంస్థ ప్రచురించింది. 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలోని వివిధ చారిత్రాత్మక ఘట్టాలను దీనిలో పొందుపరిచారు. 3,648 కి.మీ సుధీర్ఘంగా సాగిన పాదయాత్రను ఫోటోలతో సహా పుస్తకాన్ని రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు, శేఖర్‌గుప్తా, రామచంద్రమూర్తి, వైఎస్సార్‌సీపీ నేతలు, సీనియర్‌ పాత్రికేయులు పాల్గొన్నారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం: సీఎం వైఎస్‌ జగన్‌
ప్రజాసంకల్ప పాదయాత్ర అనేది ఒక స్పిరిట్‌ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 3648 కి,మీ పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని, ప్రజల సహకారంతోనే పూర్తి చేయగలిగానని అన్నారు. ఏకంగా 14 నెలల పాటు సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీకి వచ్చాయని సీఎం గుర్తుచేశారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. ప్రతీక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రూపకల్పన చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
 
వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించారు..
పాదయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించారని ప్రముఖ జర్నలిస్ట్‌ శేఖర్‌ గుప్తా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆశయాలను, వారసత్వాన్ని జగన్‌ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. వైఎస్సార్‌తో తనక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. దేశంలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరముందన్నారు. కార్యక్రమంలో రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. తన నాలుగున్నర దశాబ్దాల పాత్రికేయ అనుభవంలో పాదయాత్రపై పుస్తకాన్ని రూపొందిచడం గొప్ప విషయమన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

విశాఖ సాగర తీరంలో భారీ అగ్నిప్రమాదం

కొత్త పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

కన్నాకు టీడీపీ అక్రమాలు కన్పించలేదా?

‘గ్రామ వాలంటీర్లందరూ సచివాలయ సైనికులు’

వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు..

బక్రీద్‌ శాంతి సుహృద్భావాలను పెంపొందించాలి

బడిలో ఉన్నా.. లేనట్టే !

కృష్ణా ఉగ్రరూపం.. సాగర్‌ గేట్ల ఎత్తివేత

చేప చిక్కడంలేదు!

టీడీపీ నేతలు.. సాగించిన భూ దందా

ఎక్కడుంటే అక్కడే రేషన్‌..

మాట నిలుపుకున్న సీఎం జగన్‌

గజరాజులకు గూడు.!

ఉల్లంఘనలు..

ప్రత్తిపాటి పుల్లారావు అక్రమ గెస్ట్‌ హౌస్‌

ఏరులైపారుతున్న సారా

ప్రమాదాలు జరుగుతున్నా చలనం లేదు

నేడు ఈదుల్‌ జుహా

మహిళలకు ఆసరా

పింఛన్‌లో నకిలీనోట్లు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

అంతా క్షణాల్లోనే..

ఆంత్రాక్స్‌ ముప్పు పట్టించుకోని గిరిజనం  

శ్రీశైలం డ్యామ్‌ చూడటానికి వెళ్తున్నారా?

‘స్థానిక సమరానికి సన్నాహాలు!

సీఎం వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

మాజీ రాష్ట్రపతికి నీళ్లు కరువాయే!

36 గంటల్లో అల్పపీడనం; భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ దేవరకొండతో పూరి సినిమా

తూనీగ డిజిట‌ల్ డైలాగ్‌ విడుదల

క్షమాపణ చెప్పిన మమ్ముట్టి

డిఫెన్స్‌ ఇష్టముండదు.. కొడితే సిక్సరే!

బర్త్‌డే రోజూ షూటింగ్‌లో బిజీబిజీ..

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా