శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ విస్తృత పర్యటన

6 Sep, 2019 10:41 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ, రీసెర్చ్‌ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారులకోసం జెట్టీ నిర్మాణం, ఉద్దానం ప్రజలకోసం పరిశుభ్రమైన తాగునీటి సరఫరా పథకానికి సీఎం వైఎస్‌ జగన్‌ శుంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గడప గడపకూ నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరాకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. కాశీబుగ్గలో పైలట్ ప్రాజెక్టుగా బియ్యం సరఫరా పథకాన్ని ప్రారంభిస్తారు. ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురం రాజీవ్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. ఆ తర్వాత సింగుపురంలో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు