7న సీఎం గుంటూరు పర్యటన

2 Nov, 2019 08:22 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7వ తేదీన గుంటూరు నగరానికి రానున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి మోపిదేవి వెంకటరమణా రావు, ఎమ్మెల్యే విడదల రజని, అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి, కలెక్టర్‌ శామ్యూల్‌ఆనంద్‌కుమార్‌ శుక్రవారం చర్చించారు.

సాక్షి, పట్నంబజారు(గుంటూరు): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7వ తేదీన గుంటూరుకు రానున్న నేపథ్యంలో పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు స్థానిక ఆర్‌అండ్‌బీ  గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ఆనంద్‌కుమార్‌తో సీఎం పర్యటనకు సంబంధించి వేదిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు.

సమావేశంలో పాల్గొన్న మంత్రి మోపిదేవి, ఎమ్మెల్యే రజని, అప్పిరెడ్డి 

అగ్రిగోల్డ్‌ బాధితులకు తొలి విడతగా రూ.10వేలలోపు డిపాజిట్లు చేసిన వారికి లబ్ధి చేకూర్చేందుకు రూ.264.99 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 3.69లక్షల మంది   ఉండగా జిల్లాలో 19,751 మంది ఉన్నారు. ఈ క్రమంలో సీఎం గుంటూరులో జరిగే కార్యక్రమంలో చెక్కుల పంపిణీ చేయనున్నారు. బాధితులతో పాటు, ప్రజలు సైతం హాజరుకానున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా స్థలాన్ని నిర్ణయించేందుకు దృష్టీ సారించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, రాష్ట్ర కార్యదర్శి లాలుపురం రాము తదితరులున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు