అదే భవిష్యత్‌ తరాలకు మనమిచ్చే గొప్ప ఆస్తి : జగన్‌

27 Jun, 2019 15:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఫీజు రియింబర్స్‌మెంట్‌ వాస్తవిక దృక్పథంతో అమలు చేసినప్పుడే పేద, మధ్యతరగతి పిల్లలు చదువుకోగలుతారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటలో ఉంచినప్పుడే భవిష్యత్‌ తరాలు అభివృద్ది చెందుతాయని, అదే మనం మన భవిష్యత్‌ తరాలకు ఇచ్చే గొప్ప ఆస్తి అన్నారు.  విద్యాశాఖపై సీఎం వైఎస్‌ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు పాఠశాల, ఇంటర్‌, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల సత్వర పరిష్కారంపై అధికారులతో సీఎం చర్చ జరిపారు. పాఠశాలల ఆధునీకరణ, మౌలిక వసతుల పెంపునకు చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అమ్మఒడి పథకం విధివిధానాల రూపకల్పనపై అధికారులతో చర్చించారు. ఇంటర్‌, ఉన్నత విద్యాశాఖల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్థేశం చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఫీజులు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
 
వీసీల ఎంపికకు తక్షణమే సెర్చ్‌కమిటీలు
యూనివర్శీటీలలో వీసీల ఎంపికకు తక్షణమే సెర్చ్‌కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 30 రోజుల్లో వీసీలను ఎంపిక చేయాలన్నారు. యూనివర్శీటీల్లోని అన్ని ఖాళీలను ఈ ఏడాది చివరినాటికి భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. వీసీల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని, అర్హత, అనుభవం ఉన్నవారినే వీసీలుగా ఎంపిక చేయాలని సూచించారు. ప్రభుత్వ యూనివర్శీటీలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సెంట్రల్‌ ట్రైబట్‌ యూనివర్శీటీ, గిరిజన మెడికల్‌ కాలేజీలను అరకులో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

వచ్చే విద్యాసంవత్సరం నుంచే కొత్త సిలబస్‌
ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఫీజులు సమయానికి ఇవ్వడం లేదని, ఏడాది, రెండేళ్లకు ఒకసారి ఇస్తే కాలేజీలు ఎలా బతుకుతాయి అని సీఎం జగన్‌ అధికారులను ప్రశ్నించారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ సకాలంలో చెల్లించినప్పడే పేద విద్యార్థులు చదువుకోగలుతారన్నారు. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇచ్చేలా చర్యలు తీసుసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠ్యప్రణాళిక మెరుగుపరచడానికి కమిటీ వేయాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే మార్పు చేసిన సిలబస్‌ అమల్లోకి రావాలన్నారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ పనుల పూర్తికి, ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటుకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీ సెంట్రల్‌ వర్సిటీకి రూ.450 కోట్లు

నేడు ఆలయాల మూసివేత

ప్రాణాలు తీసిన స్టాపర్‌

మూగబోయిన విప్లవ గళం

కులాల మధ్య టీడీపీ చిచ్చు 

శునకంతో మార్జాలం.. బహు ఇంద్రజాలం

వైరల్‌.. రియల్‌ 

రైలు వచ్చిందా.. ప్రాణం గోవిందా! 

ఎస్కేయూ, ద్రవిడ వీసీలకు  హైకోర్టు నోటీసులు 

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ప్రాణం తీసిన బిందె

హెచ్‌ఐవీ ఉందని ఇంటికి పంపించేశారు

బీసీలను గుర్తించింది ఒక్క జగనే!

అంచనాలు పెంచి దోపిడీ చేశారు

మహానేత స్ఫూర్తితో శ్రేయోదాయక బడ్జెట్‌

కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?

వైఎస్‌కు ఇచ్చిన వాగ్దానం మేరకే అనంతకు కియా

చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుపై సమగ్ర విచారణ

స్కెచ్చేశాడు.. చంపించాడు

రూ. కోటిన్నర లాభం కోసం.. రూ.53 కోట్లు పెట్టుబడి!

కరెంట్‌ కొనుగోళ్లపై సమీక్షతో.. ప్రజాధనం ఆదా

చంద్రయాన్‌–2 ఆగడానికి కారణమిదే

టీటీడీలో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వైవీ

ఈనాటి ముఖ్యాంశాలు

ఒకటి అడిగితే సీఎం జగన్‌ రెండు చేస్తున్నారు..

రాష్ట్రంలో మూడు కొత్త స్టేడియాలు : అవంతి

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

‘అందుకే విద్యుత్‌ ఒప్పందాలపై పునఃసమీక్ష’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం