భారం ఎంతైనా కిలో ఉల్లి రూ.25కే

4 Dec, 2019 04:35 IST|Sakshi

రైతు బజార్లలో వినియోగదారులకు ఇద్దాం

అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు

ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ 

మొత్తం భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్‌): దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా సబ్సిడీ ధరలకే రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు విక్రయిస్తోంది. ఈ విషయంలో వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖలు, రైతుబజార్ల ఎస్టేట్‌ అధికారులతో సీఎం కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వారం రోజులుగా రాష్ట్రంలో ఉల్లిధరలు కిలో రూ.80 నుండి రూ.100 వరకూ పెరగడంతో ఈ అధిక ధరలను అదుపుచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌  అధికారులను ఇప్పటికే ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గేంత వరకూ రైతు బజార్లలో అమ్మకాలు చేపట్టాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది.

ధరలను పెంచేందుకు అక్రమంగా ఎవరైనా ఉల్లిపాయలు నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంతైనా సామాన్యులకు రైతు బజార్లలో రూ.25 కే కిలో చొప్పున అమ్మాలని సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అక్రమంగా ఉల్లిపాయల నిల్వ చేస్తే వారిపై మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు రోజుకు 500 నుంచి 1,200 క్వింటాళ్ల ఉల్లిపాయలు సేకరించి మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతు బజార్లకు  తరలిస్తున్నారు. ప్రతీ కిలో మీద రూ. 50కి పైగా ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చి రైతు బజార్లకు సరఫరా చేస్తోంది.   

రాష్ట్రానికి షోలాపూర్‌ ఉల్లిపాయలు 
కర్నూలు మార్కెట్‌లో ఉల్లి నిల్వలు తగ్గిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంది. షోలాపూర్‌ మార్కెట్‌కు ఉల్లి నిల్వలు అధికంగా వస్తున్నాయనే సమాచారం తెలుసుకున్న మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న అక్కడికి తమ సిబ్బందిని పంపించారు. బుధవారం నుంచి అక్కడ ఉల్లిని కొనుగోలు చేసి రోడ్డు మార్గంలో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఉల్లి ధరల హోరు కొనసాగుతోంది. మంగళవారం క్వింటాల్‌ ఉల్లి గరిష్టంగా రూ.10,220 పలికింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు : జేసీ

ఇలా అయితే రోగులు ఎందుకు వస్తారు?

వాస్తు కోసం పోలీస్‌ స్టేషన్‌ గది కూల్చివేత

పవన్‌కల్యాణ్‌ ఓ అమీబా

పవనిజం అంటే ఇదేనేమో!

అధినేతను పట్టించుకోని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు

మద్యం మత్తులో మహిళపై హత్యాచారం

5న అనంతకు సీఎం వైఎస్‌ జగన్‌

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి లతాశ్రీ

నేనూ రాయలసీమ బిడ్డనే: అనంత కలెక్టర్‌

జేసీ అనుచరుడి జిల్లా బహిష్కరణ..!

స్నేహితుడితో కలిసి భార్యపై లైంగికదాడి

నాన్నా.. నీ కష్టాన్ని చూడలేను ఇక వెళ్లొస్తా!

మార్చి 23 నుంచి పదో తరగతి పరీక్షలు

చిన్నారి వైద్యానికి ముఖ్యమంత్రి భరోసా

విద్యుత్‌ చార్జీలు పెంచొద్దు 

రీసైక్లింగ్‌ షిప్స్‌ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు

టెక్నాలజీని అవసరానికే వినియోగించాలి

సముద్ర మార్గాన ఉగ్ర ముప్పు! 

తల్లీబిడ్డ దారుణ హత్య

శత్రుదుర్భేద్యం.. తూర్పు నౌకాదళం

పది లక్షల ఇళ్లు!

రెండో దశలో 35,000 ఇళ్లకు ‘రివర్స్‌’

విశాఖకు కొత్త దశ, దిశ

వైఎస్సార్‌ లా నేస్తం ప్రారంభం

స్మార్ట్‌ ఫోన్లలోనూ ‘రివర్స్‌’ జోరు

దిశ కేసు.. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు

‘వాళ్లు క్షమాభిక్ష కోరకుండా చట్టాన్ని సవరించాలి’

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రజనీ సినిమాలో వారిద్దరూ!

10 రోజులు ముందే పుట్టిన రోజు వేడుకలు

రాహుల్‌కు సినిమా చాన్స్‌

చూసీ చూడంగానే నచ్చుతుంది

తిట్టేవారు కూడా కావాలి

నా పేరు జగదీష్‌..కానీ అందరూ