క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

20 Dec, 2019 19:45 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విజయవాడలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని A1 కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి కేక్‌ కట్‌ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించినవారికి అవార్డులను అందచేశారు. ఈ వేడుకల్లో హొంమంత్రి సుచరిత, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, రక్షణ నిధి, మేరుగు నాగార్జున, కైలే అనిల్‌, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

అంతకు ముందు హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ... ‘మంచి పాలకుడు రావాలని మీరు చేసిన కన్నీటి ప్రార్థనలు ఫలించాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరు నెలల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా నిలిచారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో పెద్ద పీట వేశారు’ అని అన్నారు.


 

>
మరిన్ని వార్తలు