ఏపీ ఎస్సై ఫలితాలు విడుదల

22 Jul, 2019 11:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌  సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) ఫలితాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఫలితాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు నెలల తరబడి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారి అభ్యర్థన మేరకు అసెంబ్లీ ఛాంబర్‌లో సీఎం జగన్‌ నేడు ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ కుమార్‌ విశ్వజిత్‌ తదితరులు పాల్గొన్నారు. 

గత పదినెలలుగా పెండింగ్‌లో ఉన్న పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల ఫలితాలను సీఎం జగన్‌ విడుదల చేశారు. 333 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, సివిల్‌  రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఆర్‌, ఏపీఎస్పీ), డిప్యూటీ జైలర్లు, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్ల ఫలితాలను రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్టు సోమవారం రిలీజ్‌చేసింది.  మొత్తం 1,35,414 మంది అభ్యర్థులకు ఈ పోస్టుల కోసం పోటీపడ్డారు. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్‌ పరీక్షలు, పూర్తయ్యాక అందులో అర్హత పొందిన 32,745 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. వీరంతా 149 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, 75 రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఆర్‌) పోస్టులకు, 75 ఏపీ స్పెషల్‌ పోలీస్‌ విభాగానికి చెందిన రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు, 10 మంది డిప్యూటీ జైలర్ల, 20 స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు పోటీ పడ్డారు.

నెల్లూరుకు చెందిన పరుచూరి రమేష్‌, కడపకు చెందిన షేక్‌ హూస్సేన్‌, రవికిషోర్‌ 255 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. 15,775 మంది మహిళా అభ్యర్థులు పోటీపడగా 61 మంది ఎంపిక అయ్యారు. కృష్ణాజిల్లాకు చెందిన ప్రజ్ఞ 224 మార్కులతో టాపర్‌గా నిలిచారు. ధృవ పత్రాలు వెరిఫికేషన్‌ పూర్తయ్యాక ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఎస్‌ఐ పోస్టులకు ఎంపికయిన వారికి సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోలీస్‌ శాఖలో ఖాళీల భర్తీకి ప్రత్యేక డ్రైవ్‌

గొలుసు.. మామూళ్లతో కొలుచు..!

చరిత్రాత్మక బిల్లులు.. టీడీపీ రాద్ధాంతంపై సీఎం ఆగ్రహం

‘మార్పు’ మంచిదేగా!

బ్లాక్‌లిస్ట్‌లోని వేమూరికి కాంట్రాక్టా?

‘టీడీపీ, జనసేన నుంచే ఎక్కువ’

సచివాలయ పోస్టుల రాత పరీక్షలపై దృష్టి 

ప్రపంచ బ్యాంకు నిధులపై బుగ్గన కీలక ప్రకటన

భీతిగొల్పుతున్న విష సర్పాలు

‘లోకేశ్‌ ఆ వ్యాధికి లోనయ్యారు’

ఆ ఐదు గంటలు... క్షణమొక యుగంలా..

గొంతెండుతున్న మన్యం

వైఎస్సార్‌ నవోదయం పేరుతో కొత్త పథకం

పబ్‌ జీ.. యే క్యాజీ..!

అక్రమార్కులకు హైకోర్టు నోటీసులు

వికటించిన ఇంజక్షన్‌..

లైబ్రరీ సైన్సు.. ఆ ఒక్కటీ అడక్కు..

పెన్నమ్మే అమ్మ

బొమ్మలే బువ్వపెడుతున్నాయి

ఉచిత పంటల బీమాపై రైతుల్లో కొరవడిన అవగాహన

మరో చరిత్రాత్మక నిర్ణయం

చేనేత సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ఆర్కే

వారధి కోసం కదిలారు మా‘రాజులు’

రాజధానిలోమలేరియా టెర్రర్‌!

అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు: ఆళ్ల నాని

వరుణ్‌ వర్సెస్‌ సూర్య

‘ధర’ణిలో బతికేదెలా!

25 వేలమందికి 15 బస్సులు

మాచర్లలో 23 ఎకరాలు కాజేసిన మాజీ కౌన్సిలర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దుమ్ము రేపనున్న ‘సాహో’ క్లైమాక్స్‌!

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌