వాటర్‌గ్రిడ్‌తో నీటి సమస్యలకు చెక్‌ 

4 Sep, 2019 04:28 IST|Sakshi

పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

పులివెందుల: రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. దీంతో సాగు, తాగునీటి సమస్యలు తీరతాయని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నియోజకవర్గ అభివృద్ధి పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పులివెందులను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ప్రతి మండలంలో గోడౌన్లు, నియోజకవర్గాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.

అనంతరం సీఎం సహాయ నిధి కింద 9 మందికి మంజూరైన రూ.20 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌–2019లో కడపకు చెందిన ఆర్‌.కె.సిద్ధార్థ రెడ్డి, పి.వి.సాయిశ్రీనివాస్‌లు బంగారు పతకాలు సాధించిన సందర్భంగా వారిని అభినందించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా