మూడు విడతల్లో  సర్వే చేయండి

8 Jun, 2020 14:56 IST|Sakshi

సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: ఆలస్యం లేకుండా సమగ్ర భూ సర్వే మొదలు పెట్టి, మూడు విడతల్లో సర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖలో భూముల రీ సర్వేపై సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ల్యాండ్‌ అండ్‌ ఎండోమెంట్స్‌  ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌ అని, మండలాల వారీగా సర్వే చేయాలని, సర్వే హద్దు రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమగ్ర భూ సర్వే కోసం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. (కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు) 

గ్రామ సచివాలయాల పరిధిలో సర్వే చేస్తామని.. ఈ సర్వే సందర్భంగా ఏమైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మొబైల్‌ కోర్టులు నడుస్తాయని, దీంతో రికార్డుల ప్రక్షాళన అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. సర్వే వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్‌ పద్ధతిలో భద్రపరుస్తామని, ఈ డిజిటల్‌ సమాచారాన్ని పూర్తిగా ఎన్‌క్రిప్ట్‌ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ డేటాను ఎవ్వరూకూడా తారుమారు చేయలేని విధంగా ఒకే చోట కాకుండా మూడు నాలుగు చోట్ల భద్రపరుస్తామని తెలిపారు. అంతే కాకుండా భూ విక్రయాలు, బదలాయింపులు కూడా సులభంగా ఉంటాయని, రిజిస్ట్రేషన్ల ఆటో మ్యుటేషన్‌ జరుగుతుందని వెల్లడించారు. తద్వారా భూమిపై యాజమాన్యపు హక్కులు కూడా మారిపోతాయని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వేకోసం వినియోగిస్తున్న కార్స్‌ నెట్‌వర్క్‌ పని విధానాన్ని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. (ఏపీ ప్రభుత్వ పథకాలకు జాతీయస్థాయి ప్రశంసలు)

మరిన్ని వార్తలు