ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్‌ సమీక్ష

26 Dec, 2019 11:56 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అర్హులైన పేదలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్ణీత సమయంలో ఇళ్ల స్థలాల పంపిణీకై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తున్నారు.


కాగా ఇల్లులేని, అర్హులైన పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ఇళ్లు కట్టిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చిన విషయం విదితమే. అదే విధంగా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు స్థలాలు ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా వీటిని మహిళల పేరున రిజిస్ట్రేషన్‌ చేస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 

దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ సమీక్ష
తాడేపల్లి: మహిళలు, చిన్నారులపై నేరాలను అదుపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీసుకువచ్చిన దిశ చట్టం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మేరకు.. హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌, పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కాగా దిశ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారన్న విషయం తెలిసిందే.(ప్రతిష్టాత్మక ‘దిశ’ యాక్ట్‌లోని ముఖ్యాంశాలివే..)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జ‌ర్న‌లిస్ట్ మృతికి సీఎం జ‌గ‌న్ సంతాపం

సేఫ్టీ టన్నెల్‌ నుంచి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

కరోనాతో దెబ్బతిన్న ఏపీని ఆదుకోండి : విజయసాయిరెడ్డి

కోవిడ్‌-19 టెస్ట్‌ కిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

ఐటీబీపీ క్యాంప్‌లో తెలుగువారికి ముగిసిన క్వారంటైన్ 

సినిమా

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు

క‌రోనా వార్త‌ల‌పై నటి క్లారిటి

బన్ని బర్త్‌డే.. ‘నువ్వు బాగుండాలబ్బా’

పదేళ్లకు మళ్లీ ఆ డైరెక్టర్‌తో మహేష్‌?