విశాఖ నగర అభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష

3 Dec, 2019 14:52 IST|Sakshi

సాక్షి, అమరావతి : విశాఖ నగర అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తాగునీరు, రోడ్లు, పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖ మెట్రోపైనా సీఎం సమీక్షించారు. విశాఖలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులో సీఎం చర్చించారు.

ఈ సమావేశంలో చర్చించిన ముఖ్యమైన అంశాలు:
పోలవరం వద్దే నిటిని ఫిల్టర్‌ చేసి అక్కడి నుంచి విశాఖకు పంపిణీ చేయాలని సీఎం  సూచించారు.
కెనాల్స్‌ ద్వారా వస్తున్న నీటిలో చాలా వరకు నీరు వృధా అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ వృధా దాదాపు 40శాతం ఉంటుందని చెప్పారు
పైపులైన్‌ ద్వారా తాగునీటి సరఫరా అత్యవసరమని సమావేశంలో చర్చ
వాటర్‌ గ్రిడ్‌లో భాగంగా చేపట్టే ఆలోచనపై సమావేశంలో చర్చ
పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు తాగునీటి వసతిని కల్పిస్తూ, పరిశ్రమల అవసరాల కోసం డిశాలినేషన్‌ వాటర్‌ ప్లాంట్లు
పరిశ్రమలకు ప్రెష్‌ వాటర్‌ కాకుండా డిశాలినేషన్‌ నీటిని వాడే ఆలోచన చేయాలని సీఎం సూచించారు.దీనికి 1000 లీటర్లకు 57సెంట్స్‌ అంటే లీటర్‌కు 4పైససు ఖర్చు అవుతుందని సీఎం జగన్‌ చెప్పారు
డీశాలినేషన్‌ చేసి ఆ నీటిని పరిశ్రమలకు కేటాయించాలని సీఎం సూచించారు

విశాఖ వ్యర్థాల నిర్వాహణపై చర్చ
కొన్ని సంవత్సరాలుగా డంపింగ్‌  చేసిన వ్యర్థాల వల్ల కాలుష్యం ఏర్పడకుండా, భూగర్భజలాలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ
కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డులో బయో మైనింగ్‌ ప్రక్రియకు సీఎం నిర్ణయం
అక్కడున్న డంపింగ్‌యార్డులో క్రమేణా బయోమైనింగ్‌ చేయడం ద్వారా కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయం

విశాఖపట్నంలో రోడ్లు అన్నింటినీ బాగు చేయాలని సీఎం ఆదేశం
దీనికి సంబంధించిన ప్లాన్‌ను తయారు చేస్తున్నామన్న అధికారులు
నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అండర్‌ గ్రౌండ్‌డ్రైనేజీ ఏర్పాటుకూ చర్యలు తీసుకోవాలన్న సీఎం

బీచ్‌రోడ్డులో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం 
బీచ్‌రోడ్డులో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంపై అధికారులకు సీఎం సూచనలు
నిర్మాణశైలిలో మార్పులు సూచించిన సీఎం
సబ్‌మెరైన్‌ మ్యూజియం, ఫుడ్‌ కోర్టుల ఏర్పాట్లను వివరించిన అధికారులు
కైలాసగిరిలో ప్లానెటోరియంపైన వివరాలు అందించిన అధికారులు
త్వరలో పనులు చేపట్టాలన్న సీఎం

విశాఖపట్నం మెట్రోరైల్‌ మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు

10 విడతలు, 10 కారిడార్లు
మెట్రోరైల్‌ మొత్తం మార్గం 140.13 కి.మీ.
ఫస్ట్‌ ఫేజ్‌ మొత్తం 46.40 కి.మీ
స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది 34.23 కి.మీ
గురుద్వార – ఓల్డ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ 5.26
తాడిచెట్ల పాలెం నుంచి ఆర్కే బీచ్‌ 6.91 కి.మీ
2020 –2024 మధ్య పూర్తిచేయాలని ప్రతిపాదన

మరిన్ని వార్తలు