ఢిల్లీకి సీఎం జగన్‌

5 Dec, 2019 15:50 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం 4.30గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం 6.15కు ఢిల్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో వైఎస్సార్‌ ఎంపీలతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాత్రి ఢిల్లీలోనే బస చేసి శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమవుతారు. రాష్ట్ర అభివృద్దే ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని, అదే విధంగా రాష్ట్ర ఆర్థిక లోటు భర్తీ చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్‌ కోరనున్నారు. శుక్రవారం రాత్రి తిరిగి అమరావతికి చేరుకుంటారు.

కాగా, గురువారం ఉదయం అనంతపురం వెళ్లిన సీఎం జగన్‌.. పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా ఫ్యాక్టరీ గ్రాండ్‌ ఓపెనింగ్‌ వేడుకల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కియా మోటర్స్‌ ప్లాంట్‌ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కియా మోటర్స్‌ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కియా మోటార్స్‌ బాటలోలో మరికొన్ని కంపెనీలు ఏపీకి వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు