సీఎం జగన్‌ టూర్‌ షెడ్యూల్‌ ఖరారు 

22 Feb, 2020 08:45 IST|Sakshi

జిల్లాలో ఈ నెల 24న ముఖ్యమంత్రి పర్యటన  

ఆ రోజు ఉదయం 11 గంటలకు జిల్లాకు రాక 

దాదాపు రెండు గంటల పాటు కార్యక్రమాలు 

జగనన్న వసతి దీవెనకు ఇక్కడే శ్రీకారం 

దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం 

షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం 

సాక్షి, విజయనగరం: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 24వ తేదీన విజయనగరంలో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వైఎస్‌ఆర్‌ జగనన్న వసతిదీవెన పథకాన్ని విజయనగరం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కొత్తగా తీసుకువచ్చిన దిశ చట్టాన్ని పకడ్భందీగా అమలు చేస్తూ, మహిళలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌ స్టేషన్‌ను సీఎం ప్రారంభిస్తారు.

గన్నవరం నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకుని, అక్కడి నుంచి హెలికాఫ్టర్‌ ద్వారా విజయనగరంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానానికి ఆ రోజు ఉదయం 11 గంటలకు సీఎం చేరుకుని 1గంటకు కార్యక్రమాలను ముగించుకుని తిరిగి హెలికాఫ్టర్‌లో విశాఖపట్నం, అక్కడి నుంచి విమానంలో గన్నవరం వెళతారు. ఈ మేరకు అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. హెలికాఫ్టర్‌ దిగి బహిరంగ సభకు చేరుకునే మార్గం పొడవునా జిల్లా ప్రజలు సీఎంకు స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలపనున్నారు.  ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి కనీవినీ ఎరుగని రీతితో స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. 

సీఎం పర్యటన షెడ్యూల్‌ ఇలా: 
ఉదయం 11.00: విజయనగరంలోని పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు 
ఉదయం 11.02: ప్రజలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు సీఎంకు స్వాగతం పలుకుతారు 
ఉదయం 11.03: పోలీస్‌ òట్రైనింగ్‌ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌ నుంచి అయోధ్యమైదానానికి సీఎం బయలు దేరుతారు 
ఉదయం 11.15: అయోధ్య మైదానంలోని బహిరంగ సభకు సీఎం చేరుకుంటారు 
ఉదయం 11.15 నుంచి 11.25 వరకూ:  అయోధ్య మైదానంలో ఎగ్జిబిషన్‌ స్టాళ్లను సందర్శిస్తారు 
ఉదయం 11.25 నుంచి మధ్యాహ్నం 12.25 వరకూ: వైఎస్‌ఆర్‌ జగనన్న వసతిదీవెన పథకం ప్రారంభిస్తారు 
మధ్యాహ్నం 12.25: బహిరంగ సభ ప్రాంగణం నుంచి దిశ పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరుతారు 
మధ్యాహ్నం 12.35 నుంచి 2.45 వరకూ:    పోలీస్‌ బ్యారెక్స్‌ గ్రౌండ్‌లో దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు 
మధ్యాహ్నం 12.45: దిశ పోలీస్‌ స్టేషన్‌ నుంచి పోలీస్‌ శిక్షణ కేంద్రంలోని హెలిప్యాడ్‌ వద్దకు బయలుదేరుతారు 
మధ్యాహ్నం 12.50:  పోలీస్‌ శిక్షణ కేంద్రంలోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు 
మధ్యాహ్నం 1.00:  హెలికాఫ్టర్‌లో విశాఖపట్నం బయలుదేరుతారు

మరిన్ని వార్తలు