వ్యర్థాల నిర్వహణకు ‘ఆన్‌లైన్‌’ వేదిక 

5 Jun, 2020 08:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇక నుంచి వ్యర్థాల నిర్వహణ కోసం పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేదు. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్‌లైన్‌లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్‌ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ నిర్వహణ సంస్థ (ఏపీఈఎంసీ) వ్యర్థాల బదలాయింపునకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించనుంది. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఆన్‌లైన్‌ వేస్ట్‌ ఎక్ఛ్సేంజ్‌ ప్లాట్‌ఫామ్‌’ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. (త్వరలో 3,795 వీఆర్‌వో పోస్టుల భర్తీ)

ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. కలుషిత వ్యర్థాలను సమర్థంగా నిర్వహించే ట్రీట్‌మెంట్‌ వ్యవస్థలేని పరిశ్రమలు ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించే సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది. ఇలా పరిశ్రమలు – వ్యర్థాల సమర్థ నిర్వహణ సంస్థలను ఆన్‌లైన్‌ వేదికగా కలిపేందుకు ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ నిర్వహణ సంస్థ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఇందుకుగాను వ్యర్థాల నిర్వహణ సంస్థలకు, ఏపీఈఎంసీకి పరిశ్రమలు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా ఆన్‌లైన్‌ వేస్ట్‌ ఎక్ఛ్సేంజ్‌ ప్లాట్‌ఫామ్‌ దేశంలోనే ఇది మొదటిది కావడం 
గమనార్హం. (గ్యాంగ్‌ వార్‌ కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు )

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు