వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం జగన్‌

2 Sep, 2019 09:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుని ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం.. అదే విధంగా ప్రతీ వ్యక్తి జీవితం శాంతి, సౌఖ్యాలతో వర్ధిల్లాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా నేడు మహానేత వైఎస్సార్‌ పదవ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. సీఎంతో పాటు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద అంజలి ఘటించారు. వారితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌డ్డి, వైఎస్సార్‌ అభిమానులు నివాళులర్పించారు.

ఇక ఇడుపులపాయ నుంచి బయల్దేరిన అనంతరం పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించే వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో సీఎం జగన్‌ పాల్గొంటారు. భాకరాపురంలో వైఎస్‌ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

మరిన్ని వార్తలు