కోస్తాంధ్ర, తెలంగాణకు భారీ వర్ష సూచన

19 Sep, 2014 03:46 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఒరిస్సా, ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీన్ని ఆనుకుని సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఇది ప్రస్తుతం నైరుతి దిశగా కదులుతోంది. మరోవైపు ఆంధ్రా తీరం నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లోను, తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవాకాశాలున్నాయని తెలిపింది.

మరిన్ని వార్తలు