ఆ కలెక్టర్‌ ఇళ్లకూ వచ్చేస్తున్నారు..!

23 Nov, 2019 11:58 IST|Sakshi
భీమవరంలోని శ్రీరామపురంలో ఓ ఇంటికి వెళ్లి నవశకం సర్వేపై ఆరా తీస్తున్న కలెక్టర్‌ ముత్యాలరాజు

పట్టణంలో శ్రీరామపురంలోని ఓ ఇంటి వద్ద శుక్రవారం కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అధికారులు, సిబ్బందితో సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు. అక్కడి ప్రజలు తేరుకునేలోగానే నవశకం సర్వే జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. వలంటీర్లు సర్వే చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆయన భీమవరం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో నవశకం, పట్టణంలో డంపింగ్‌యార్డుకు అవసరమైన భూమి సేకరణపై సమీక్ష నిర్వహించారు.  

సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్‌):  పట్టణంలో అధికారులతో సమీక్ష అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 20 వరకూ నవశకంపై వలంటీర్లు సర్వే చేస్తారన్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్‌ కానుక కార్డులకు లబ్ధిదారుల సమాచారం పక్కాగా సేకరించడానికి వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారన్నారు.  పట్టణంలో 40 వార్డు సచివాలయాలు ఉండగా నాలుగు వార్డులకు ఒకరు చొప్పున 10 మంది సూపర్‌వైజర్లను నియమించి సర్వే చేయిస్తున్నామన్నారు. సర్వే అనంతరం వార్డు సభలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అనంతరం లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తామన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పట్టణంలో సదరమ్‌ క్యాంపు ఏర్పాటు చేయాలని కోరారని చెప్పారు. అయితే ప్రతి నియోజకవర్గంలో  సదరమ్‌ క్యాంపు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ తెలిపారు. నర్సాపురం సబ్‌ కలెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథ్, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.అమరయ్య, అసిస్టెంట్‌ కమిషనర్‌ బి,జ్యోతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

దిరుసుమర్రులో తనిఖీలు  
భీమవరం అర్బన్‌:  మండలంలోని దిరుసుమర్రు గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు పరిశీలించారు. పాఠశాలలో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను మౌలిక వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం గ్రామ సచివాలయంకు వెళ్లి పలు పథకాల అమలు, నవశకం సర్వే వివరాల రికార్డులు పరిశీలించారు. అనంతరం భీమవరం వెళ్లిపోయారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోసపోయి.. జైలుకు చేరువై 

గుంటూరులో హత్య.. ప్రకాశంలో మృతదేహం!!

ఇక ఉగాది కానుక!

'రెండేళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి'

రౌడీషీటర్‌తో లోకేష్‌ ములాఖత్‌ 

బెంబేలెత్తిస్తున్న బ్లేడ్‌ బ్యాచ్‌

రౌడీషీటర్లలో మార్పునకు  కౌన్సెలింగ్‌

ప్రియుడితో కలిసి.. భర్తను స్కార్పియోతో తొక్కించి!!

'మహానగరాల కంటే ఇక్కడ బంగారం ధర తక్కువ'

స్పానిష్‌ అమ్మాయి.. అనంతపురం అబ్బాయి..!!

సముద్రంలో చేపల వేట ప్రోత్సాహానికి ఆర్థిక సాయం 

నెలాఖరులోగా ‘అమ్మఒడి’ అర్హుల జాబితా

దమ్ముంటే ఒక్క పేరు చెప్పు

చంద్రబాబుకు జ్ఞానోదయం

ఇంగ్లిష్‌ మీడియంపై ఎవరూ మాట్లాడొద్దు.. 

ఇసుక దొంగకు మూడేళ్ల జైలు శిక్ష

చదువుల వెంటే కొలువులు

ఇసుక మాఫియాకు చెక్‌

‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ దరఖాస్తు గడువు పొడిగింపు

బార్ల లైసెన్సుల రద్దు

జీఎస్టీ పరిహారం..ఎన్నాళ్లీ జాప్యం?

బీసీ విద్యార్థులకు సర్కారు బొనాంజ

శంకుస్థాపన చేసిన 4 వారాల్లోగా పనులు ప్రారంభం

స్పైస్‌ జెట్‌ విమానానికి తప్పిన ముప్పు

తిరుమలలో మద్యపాన నిషేధంపై మార్పులు

ఈనాటి ముఖ్యాంశాలు

ఏపీ మారిటైం బోర్డు ఏర్పాటుకు సీఎం జగన్‌ కీలక నిర్ణయం

'చేపల వేట ప్రోత్సాహానికి ఆర్థిక సాయం'

లోకేష్‌కు అంత సీన్‌ లేదు: కొడాలి నాని

ఏపీలో నూతన బార్‌ పాలసీపై ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘హ్యపీ బర్త్‌డే టు మై డైరెక్టర్‌’

అభిమానులకు రజనీ బర్త్‌డే గిఫ్ట్‌ అదేనా?

‘16వ ఏటనే ఒక అబ్బాయితో డేటింగ్‌ చేశా’

కమల్‌కు శస్త్ర చికిత్స విజయవంతం

అందర్నీ ఏకం చేసే మాధ్యమం సినిమా

రకుల్‌ ఎటాక్‌