అధికారులపై కలెక్టర్‌ కొరడా

1 May, 2018 13:12 IST|Sakshi
జిల్లా స్థాయి అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ముగ్గురు అధికారులకు షోకాజ్‌ నోటీసులు

పశుసంవర్ధకశాఖ జేడీ సరెండర్‌

సమస్యలు పరిష్కరించని అధికారులకు జరిమానా

ఏలూరు(మెట్రో) : నిర్ణీత కాల వ్యవధిలో ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఆయా శాఖల అధికారులకు రూ.100 చొప్పున జరిమానా విధిస్తానని కలెక్టర్‌ భాస్కర్‌ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు అందించిన వినతిపత్రాలు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం కావాలని ఆదేశించారు. నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారం కాని ఒకొక్క ఫిర్యాదుకు రూ.100 చొప్పున జరిమానా విధిస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు.

జరిమానా ఇలా..
ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ 34 ఫిర్యాదులకు రూ.3,400, సర్వే సెటిల్‌మెంట్‌ శాఖకు 19 ఫిర్యాదులకు రూ.1,900, పౌరసరఫరాల శాఖకు రూ.1,600, మత్స్య శాఖకు రూ.1,000, పంచాయతీ కార్యదర్శులకు రూ.600, దేవాదాయశాఖకు రూ.700 జరిమానా విధిస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

అధికారులపై చర్యలు
మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రజాసమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్క్‌ఫెడ్‌ డీఎం నాగమల్లికకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని కలెక్టర్‌ డీఆర్‌ఓను ఆదేశించారు. అలాగే పశుసంవర్ధకశాఖ జేడీని ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ డీఎం, మార్క్‌ఫెడ్‌ డీఎం, జిల్లా గ్రంథాలయ సంస్థ, ఏపీఐఐసీ శాఖల ఉన్నతాధికారులకు ఈ–ఫైలింగ్‌ అమలు చేయని కారణంగా షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని డీఆర్‌ఓ సత్యనారాయణను కలెక్టర్‌ ఆదేశించారు.

10వ తరగతి ఫలితాల్లోవెనుకబాటు ఎందుకు
జిల్లాలో ఉపాధ్యాయులంతా బాధ్యతగా పాఠాలు చెబితే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వెనుకబాటు ఎందుకు వచ్చిందని, దీనికి ఏయే టీచర్‌ బాధ్యులో గుర్తించాలని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ డీఈఓ రేణుకను ఆదేశించారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తహసీల్దార్లను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాఠీ పట్టిన రైతు బిడ్డ

పట్టా కావాలా నాయనా !

గాంధీ పేరు రాయలేకపోతున్నారు!

డీఎడ్‌ కోర్సుకు కొత్తరూపు..!

మరీ ఇంత బరితెగింపా? 

అమ్మ కావాలని.. ఎక్కడున్నావంటూ..

కరువు సీమలో మరో టెండూల్కర్‌

మీరైతే ఇలాంటి భోజనం చేస్తారా? 

మూడు రోజులకే అనాథగా మారిన పసిపాప

కొత్త చట్టంతో ‘కిక్కు’పోతుంది

‘కొటక్‌’కు భారీ వడ్డన

ముందుకొస్తున్న ముప్పు

అధిక వడ్డీల పేరుతో టోకరా

తుంగభద్ర ఆయకట్టులో కన్నీటి సేద్యం

పోలీసుల వలలో మోసగాడు

కేసీఆర్‌ పేరు ఎత్తితేనే భయపడి పోతున్నారు

విత్తన సమస్య పాపం బాబుదే!

రంజీ క్రికెటర్‌ నకిలీ ఆటలు

అసెంబ్లీ నిరవధిక వాయిదా

నేడు మల్లన్న ముంగిట్లో కృష్ణమ్మ!

అప్పు బారెడు.. ఆస్తి మూరెడు

‘ఫైబర్‌గ్రిడ్‌’లో రూ.వేల కోట్ల దోపిడీ

14 రోజులు 19 బిల్లులు

కొరత లేకుండా.. ఇసుక

హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు : సీఎం జగన్‌

వార్డు సచివాలయ అభ్యర్థులకు హెల్ప్‌డెస్క్‌

పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే పెట్రోల్‌ పోసుకుని..

ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా

ఈనాటి ముఖ్యాంశాలు

విషయాన్ని గోప్యంగా ఉంచి ఏకంగా మృతదేహంతో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి