రాయలసీమ సంస్కృతి ఉట్టిపడేలా ఈ ఉత్సవం..

4 Mar, 2020 16:31 IST|Sakshi
అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు

సాక్షి, విజయవాడ: రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింపజేసేలా లేపాక్షి సంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు వెల్లడించారు. బుధవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పర్యాటక శాఖ ఏండీ ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... మార్చి 7, 8న ఏపీ పర్యాటక శాక అధ్వర్యంలో అనంతపురంలో జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి లేపాక్షి ఉత్సావాలను వైభవం నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌తో ఉత్సవాలు జరుగుతాయని, ఈ ఏడాది సంస్కృతిని థీమ్‌గా తీసుకున్నామన్నారు. కాగా ఈ ఉత్సవం నిర్వహణకు 15 కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. బాహ్య ప్రపంచానికి తెలియజేప్పెలా ఈ ఉత్సవాల నిర్వహణ ఉంటుందని, 2018లో లక్షకు పైగా ప్రజలు వచ్చారన్నారు.  ఈసారి ఇంకా ఎక్కువ పర్యటకలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన అంచన వేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలలో లేజర్ షో, ప్రముఖ గాయకులతో పాటలు, శోభాయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా పర్యాటకులకు ఒక మంచి అనుభూతిని అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.  రాయలసీమ వైభవాన్ని తెలిపేలా.. గ్రామీణ పర్యటకాన్ని కూడా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అంతేగాక రాయలసీమ ప్రత్యేక వంటకాలను సైతం ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఉగ్గాని, రాగి సంగటి, నాటుకోడి కూర, గుత్తి వంకాయ వంటి ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో రాయలసీమ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఇక రాయలసీమ జీవన శైలిని ఉట్టిపడేలా దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా అత్యంత వైభవంగా నిర్వహించే ఈ లేపాక్షి వైభవములో అందరూ  పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

నేను, నాది కాదు.. మనం, మనది!

ఇక పర్యటక శాక ఏండీ ప్రవీణ్ కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమలోను మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటి ద్వారా ఇతర ప్రాంతాల వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ పర్యాటక ప్రాంతాలను గుర్తిస్తూ వస్తున్నామన్నారు. పర్యాటక రంగం మంచి ఆదాయ వనరని, దీని ద్వారా కేరళ మంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటోoదన్నారు. ఈ రంగం ద్వారా స్థానికంగా ఉపాధి కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కాగా కరోనా వార్తల నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం వైద్య సిబ్బందిని  అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

మరిన్ని వార్తలు