అందరికీ అందుబాటులో ఇసుక

16 Nov, 2019 15:47 IST|Sakshi

కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌

సాక్షి, విజయవాడ: వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వచ్చాయని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఈ నెల 21 వరకూ ఇసుక వారోత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. ఇసుక కొరత తీర్చేందుకు ఇసుక రీచ్ లతో పాటు స్టాక్ డిపోలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విజయవాడలోని భవానీపురం, షాదీఖానా, కానూరులో మూడు స్టాక్ డిపోలతో పాటు మచిలీపట్నం, మైలవరం, నూజివీడులో కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆన్‌లైన్‌లో ఇసుకను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రస్తుతం ఐదు ఇసుక రీచ్‌ల తో పాటు నాలుగు పట్టా భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో వారం రోజులలో ఐదు ఇసుక రీచ్‌లు, ఐదు పట్టా భూములు అందుబాటులో కి రానున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇసుక రీచ్‌ లు , స్టాక్ పాయింట్లు, స్టాక్ యార్డులు మొత్తం 15  అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు