ప్రతీరోజూ రెండు వేల కరోనా పరీక్షలు లక్ష్యం

11 Jun, 2020 19:41 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 54,385 కరోనా పరీక్షలు నిర్వహించామని కలెక్టర్‌ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీరోజూ రెండు వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని తెలిపారు. విజయవాడ, మచిలీపట్నం, నూజివీడు, గన్నవరం ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 20 వైద్య బృందాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. (ఏపీ: వైద్యారోగ్య శాఖలో 9712 పోస్టుల భర్తీకి ఆదేశాలు)

600 పడకల నిమ్రా ఆసుపత్రిని మూడో కోవిడ్ సెంటర్‌గా గుర్తించామని వెల్లడించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలకు చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దు దాటి రావాలంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. త్వరితగతిన శాంపిల్స్ సేకరించేందుకు చెక్‌పోస్ట్‌, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టుల్లో ఐ మాస్క్ బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా వైరస్‌ కట్టడికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఇంతియాజ్‌ విజ్ఞప్తి చేశారు. (అక్రమ ఇసుక, మద్యం రవాణాపై కఠిన చర్యలు)

మరిన్ని వార్తలు