త్వరలో ‘థ్యాంక్యూ అంగన్‌వాడీ అక్క’

4 Sep, 2019 12:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ: జిల్లాలో పౌష్టికాహార మాసోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. పౌష్టికాహారంపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పౌష్టికాహారాన్ని పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు.

త్వరలోనే ‘థ్యాంక్యూ అంగన్‌వాడీ అక్క’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. జిల్లాలో బలహీనంగా ఉన్న పిల్లలు ఉండకూడదనేది తమ లక్ష్యమని తెలిపారు. దాన్ని చేరుకోడానికి అవసరమైన వనరులన్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌష్టికాహార మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా