నిర్ణీత గడువులోపు కియా పూర్తికావాలి

18 May, 2018 08:40 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ జి.వీరపాండియన్‌

అనంతపురం అర్బన్‌:నిర్దేశించిన గడువులోపు కియా కార్ల పరిశ్రమ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరఫు నుంచి అందించాల్సిన సహకారాన్ని ఇవ్వాలని ఆదేశించారు. గురువారం కియా పరిశ్రమ పురోగతిపై కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కియా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంఓయూ ప్రకారం ప్రాజెక్టు సైట్‌కు వారంలోపు సేల్‌ అగ్రిమెంట్‌ పూర్తి చేయాలని ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ను  ఆదేశించారు.

కియా సైట్‌లో హెలి పాడ్, టౌన్‌షిప్, శిక్షణ కేంద్రం, తదితర ప్రదేశాలన్నీ జోనింగ్‌ చేయాలని నగర పాలక కమిషనర్‌ మూర్తిని ఆదేశించారు. కియా కార్ల పరిశ్రమకు సంబంధించిన వ్యర్థాల నిర్వహణకు మడకశిరలో గుర్తించిన భూమిని కియా ప్రతినిధులకు చూపించి ఆమోదయోగ్యమా, కాదా అనేది తెలపాలన్నారు. కొరియన్‌ ప్రతినిధులు పిల్లల చదువుకు ఇంటర్నేషనల్‌ స్కూల్, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.  పదోతరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థినులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేయాలని డీఆర్‌డీఏ పీడీ కేఎస్‌ రామారావును ఆదేశిం చారు.

స్థానికులకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత
కియాలో ఉద్యోగాలకు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలోని పాలిటెక్నిక్, ఐటీఐ, యూనివర్సిటీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.   సమావేశంలో కియా ప్రతనిధి జూడ్, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనాథ్, జిల్లా పరిశ్రమల శాఖ ఇన్‌చార్జీ జీఎం జేమ్స్‌ సుందర్రాజు, డీడీ శ్రీనివాస్‌ తదితరులు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు