ఆ వార్తలు అవాస్తవం: కలెక్టర్‌ వీరపాండియన్

21 Jul, 2020 19:44 IST|Sakshi

సాక్షి, కర్నూల్‌: జిల్లా జీజీహెచ్‌ స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక కరోనా రోగులు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలను జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్ కొట్టిపారేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హస్పీటల్‌లో అన్ని వైద్య సదుపాయలు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని స్పష్టం చేశారు. ఎటువంటి ఆక్సీజన్‌, బెడ్స్‌ కొరత వంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ అందక రోగులు మృతి చెందుతున్నారంటూ వస్తున్న మీడియా కథనాలు అవాస్తమని వెల్లడించారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా పుకార్లు పుట్టిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. పుకార్లను నమ్మి ప్రజాలేవరూ ఆందోళన చెందవద్దని, జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ముందు జాగ్రత్తగా ప్రభుత్వం కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో 11.5 కేఎల్‌డీ కెపాసిటీతో పెద్ద ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసి పైప్ ద్వారా పేషేంట్స్ ఆక్సీజన్ సరఫరా చేస్తుందని తెలిపారు. (చదవండి: ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ)

ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 11.5 కె.ఎల్.డి పెద్ద ఆక్సీజన్ ట్యాంక్ కు అదనంగా ఇంకా పాజిటివ్ కేసులు పెరిగినా ఇబ్బంది కలగకుండా మరో 10 కేఎల్‌డీ కెపాసిటీతో అదనంగా కొత్త ఆక్సీజన్ ట్యాంక్ నిర్మాణపు పనులు పూర్తి దశలో ఉన్నాయన్నారు. నాగపూర్‌లో ఉన్న డైరెక్టర్ జెనరల్ (హైఎక్స్‌ప్లోజివ్స్)  నుండి అనుమతి వచ్చిన వెంటనే అదనపు 10 కేఎల్‌డీ ఆక్సీజన్ ట్యాంక్‌ను ఉపయోగించనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. కోవిడ్ పేషేంట్స్ ఆక్సీజన్ అందక మృతి చెందుతున్నారు అనేది వాస్తవం కాదు కర్నూలు జిజిహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ప్రస్తుతం 450 బెడ్స్కు ఆక్సీజన్ సరఫరా సౌకర్యం ఉంది. అదనంగా మరో 1131 బెడ్స్ కు ఆక్సీజన్ సరఫరా కోసం చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ ఉన్న పాజిటివ్ కేసులకు గాను డైలీ 120 మందికి మాత్రమే ఆక్సీజన్ అవసరం ఉందని డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఆస్పత్రిలో సరిపడా ఆక్సీజన్, బెడ్స్ ఉన్నాయన్నారు. (చదవండి: మరో 26 మంది కరోనాను గెలిచారు..)

నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గతంలో 20 బెడ్స్‌కు ఆక్సీజన్ సరఫరా ఉండగా.. అదనంగా మరో 160 బెడ్స్‌కు ఆక్సీజన్ సరఫరా సదుపాయం కల్పించామని చెప్పారు. ఆదోని ప్రభుత్వ జనరల్ ఏరియా ఆస్పత్రిలో గతంలో ఆక్సీజన్ సరఫరా ఉన్న బెడ్స్ జీరో ఉండగా ప్రస్తుతం 100 బెడ్స్‌కు కొత్తగా ఆక్సీజన్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో 1581 బెడ్స్‌కు, నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో 161 బెడ్స్‌తో పాటు, ఆదోని ప్రభుత్వ ఏరియా జనరల్ ఆస్పత్రిలో 100 బెడ్స్‌కు కలిపి మొత్తం 1841 బెడ్స్‌కు ఆక్సీజన్ సదుపాయం ప్రభుత్వం తరఫున కల్పించామన్నారు. కాబట్టి కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో గాని, జిల్లాలో గాని కోవిడ్ పేషేంట్స్‌కు ఆక్సీజన్, బెడ్స్ కొరత లేదని స్పష్టం చేశారు. కావునా ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, పుకార్లను నమ్మోద్దని ఆయన సూచించారు. పుకార్లు పుట్టించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చారించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు