కళాశాల బస్సు ఢీకొని విద్యార్థిని మృతి

19 Sep, 2013 03:35 IST|Sakshi
 కామారెడ్డిటౌన్/సదాశివనగర్/గాంధా రి, న్యూస్‌లైన్:  సదాశివనగర్ మండలం దగ్గి గ్రామశివారులో ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం కళాశాల బస్సు ఢీకొని గాంధారి మండలం వజ్జపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కాట్యాడ శృతి (12) మృతిచెందింది. శృతి కామారెడ్డికి వె ళ్లేందుకు సైకిల్‌పై దగ్గి ప్రధాన రోడ్డుకు వస్తుండగా ఎదురుగా వచ్చిన కామారెడ్డికి చెందిన జ్ఞానదీప్ జూనియ ర్ కళాశాలకు చెందిన (ఏపీ 25డబ్ల్యూ 5383) నంబరు బస్సు వేగంగా ఢీకొట్టింది.
 
 ఈ ప్రమాదంలో శృతి ఎగిరిపడడ ంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉం డంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెంది ంది. శృతి కామారెడ్డి పట్టణంలోని ఆర్‌కిడ్స్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ప్రతిరోజు పాఠశాలకు వెళ్ల్లేందు కు వజ్జపల్లి నుంచి దగ్గి రోడ్డు వరకు సైకిల్‌పై వచ్చి, అక్కడ సైకిల్ పెట్టి బస్సులో కామారెడ్డికి పాఠశాలకు వెళ్తుండేది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు రాజేం దర్‌రావ్, లక్ష్మీబాయి విలపించారు.  కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
 
 గ్రామస్తుల ఆగ్రహం..
 తమ బస్సు వల్లే విద్యార్థిని మృతి చెంది నా కళాశాలకు చెందిన యాజమాన్యం స్పందించకపోవడంతో వజ్జపల్లి గ్రామస్తులు, బంధువులు కామారెడ్డి పట్టణంలోని జ్ఞానదీప్ కళాశాల యాజమాన్యం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో కళాశాల సిబ్బందితో ఏరి యా ఆస్పత్రిలో వాగ్వాదానికి దిగారు. యాజమాన్యం స్పందించకపోవడంతో జీవదాన్ ఆస్పత్రి సమీపంలో ఉన్న కళాశాల వద్దకు వెళ్లి ఆఫీస్ చాంబర్‌లో ఉన్న కంప్యూటర్, బీరువాలు, కిటీకీల, అద్దా లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీ సులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కళాశాల యా జమాన్యం తరపున కొందరు వ్యక్తులు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. పోస్టుమార్టం అనంతరం గ్రామస్తులు గ్రామానికి వెళ్లిపోయారు. 
 
>
మరిన్ని వార్తలు