ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు 

26 Jul, 2019 03:57 IST|Sakshi

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు.. 

కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో నలుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆ మేరకు ఆర్‌.రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, డి.రమేశ్, ఎన్‌.జయసూర్యల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు టి.వినోద్‌కుమార్, ఎ.అభిషేక్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌లను సిఫారసు చేసింది. ఉమ్మడి హైకోర్టులో అప్పటి హైకోర్టు కొలీజియం 2018 అక్టోబర్‌ 9న ఈ ఏడుగురు పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది.

తాజాగా ఈ ఏడుగురితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, న్యాయమూర్తులు జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌.వి.రమణలతో కూడిన కొలీజియం గురువారం ముఖాముఖీ సమావేశమైంది. అనంతరం రెండు రాష్ట్రాల హైకోర్టులకు వీరి పేర్లను సిఫారసు చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు వీరు సరిగ్గా సరిపోతారని కొలీజియం తన తీర్మానంలో పేర్కొంది. ఈ సిఫారసులకు కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత రాష్ట్రపతి వద్దకు వెళతాయి. రాష్ట్రపతి ఆమోదించాక వీరి నియామకాలపై కేంద్రం నోటిఫికేషన్‌ ఇస్తుంది.  ఈ నలుగురు న్యాయమూర్తుల నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరుకుంటుంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మేం తీవ్రంగావ్యతిరేకిస్తున్నాం

విప్లవాత్మక మార్పుకు నాంది

రోల్‌మోడల్‌గా ‘ఆరోగ్యశ్రీ’

‘నీరు – చెట్టు’ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ

ఆలయాలు, ట్రస్టు బోర్డుల్లోనూ సామాజిక న్యాయం

‘సాగుదారుల చుట్టం’..!

వరద గోదావరిని ఒడిసి పడదాం

ఏపీలో 108 సిబ్బంది సమ్మె విరమణ

‘టీడీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు’

నైజీరియన్ల అక్రమ దందాకు తెర

ఈనాటి ముఖ్యాంశాలు

సీఎం జగన్‌ను కలుసుకున్న ఆస్ట్రేలియా బృందం

ఐఐటీల్లో రెండేళ్లలో 2461 డ్రాపవుట్లు

‘భూమిపై అన్నిరకాల హక్కులు రైతులకే’

ఇదొక విప్లవాత్మక కార్యాచరణ: సీఎం జగన్‌

చంద్రబాబు కంటే కేసీఆర్‌ వెయ్యిరెట్లు మంచివారు..

జైలు శిక్ష అభ్యంతరకరం: ఎంపీ మిథున్‌రెడ్డి

తెలుగువారంతా కలిసికట్టుగా ఉండాలి

బాలికపై లైంగికదాడి

‘గంటా’.. ‘గణ’గణమనలేదు! 

త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు

రేషన్‌ డీలర్లను తొలగించే ప్రసక్తే లేదు

‘పట్టిసీమ వల్ల సీమకు ఉపయోగం లేదు’

జసిత్‌ క్షేమం; తండ్రిపై ఆరోపణలు..!

ఎంతటి సర్పమైనా ఇట్టే పట్టేస్తాడు..

అందుకే చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు

గోదావరి జలాలపై అసెంబ్లీలో కీలక చర్చ

లోకేశ్‌ సీఎం కాకూడదని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం