రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి

2 Nov, 2013 05:33 IST|Sakshi

మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, న్యూస్‌లైన్:  ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు యు వత రక్తదానం చేయాలని రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక నవోదయ ఆస్పత్రిలో వైద్య విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి నాలుగు నెలలకోసారి రక్తదానం చేయవచ్చన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రితోపాటు ఇతర ఆస్పత్రులకు ప్రతిరోజూ ఎంతో మంది వివిధ శస్త్ర చికిత్సల కోసం, ప్రమాదాల్లో గాయపడిన వారు వస్తుంటారన్నారు. అలాంటి వారికి రక్తం చాలా అవసరం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ కార్యదర్శి ఎం.బాలయ్య, వైస్ చైర్మన్ నటరాజ్, సభ్యులు యాదయ్యగుప్తా, చంద్రమౌళి, నవోదయ ఆస్పత్రి డెరైక్టర్ రవీందర్‌రెడ్డి, వైద్యులు కిరణ్మయి, సిబ్బంది ఎల్లస్వామి, రవి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు