సమస్య ఏదైనా నా ఇంటికి రండి

30 Jun, 2019 12:58 IST|Sakshi
ముత్తాయపాలెంలో మాట్లాడుతున్న డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి

కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా న్యాయం చేస్తా

అనునిత్యం పేదల పక్షానే నిలుస్తా 

గ్రామసభల్లో డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి

బాపట్లటౌన్‌: గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే నాకు తెలుసు. పేదవాడు ఎక్కడున్నా పేదవాడే. ఇన్నాళ్లు మన చేతిలో అధికారం లేకపోవడం వలన పనులు చేయలేకపోయాను. దేవుని దయ...మీ అందరి ఆశీస్సులతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చోరవతో ఉప సభాపతి అయ్యాను. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నా ఇంటికి ఎప్పుడైనా రావోచ్చు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తానంటూ డెప్యూటీ స్పీకర్‌ కోనరఘుపతి శనివారం మండలంలోని కొండుబోట్లవారిపాలెం, ఈస్ట్‌బాపట్ల, పిన్నిబోయినవారిపాలెం, ముత్తాయపాలెం, మరుప్రోలువారిపాలెం, అసోదివారిపాలెం, వెస్ట్‌బాపట్ల పంచాయతీల్లో జరిగిన గ్రామసభల్లో మాట్లాడారు 

మరిన్ని వార్తలు