నాటక రంగాన్ని బతికించాలి

27 Apr, 2018 12:20 IST|Sakshi
నాటక పోటీల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న బ్రహ్మానందం

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం

బుచ్చిరెడ్డిపాళెం: కనుమరుగవుతున్న నాటక రంగాన్ని బతికించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రముఖ సినీ హాస్యనటుడు పద్మశ్రీ డాక్టర్‌ బ్రహ్మా నందం పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాళెంలోని వవ్వేరు కోఆపరేటివ్‌ బ్యాంకు ఆవరణలో 33వ జాతీయస్థాయి నాటక పోటీలను గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు పౌరాణిక నాటకాలు ప్రాముఖ్యంగా ఉన్నాయని, నేడు సందేశాత్మక నాటికలు ఉన్నాయని తెలిపారు. అవన్నీ మనిషి జీవితంలోని యధార్థ సంఘటనలను కళ్లకు కట్టేలా ఉంటాయన్నారు. అలాం టి నాటక రంగాన్ని కాపాడుతూ, 33 ఏళ్ల పాటు కళాసాగర్‌ నిర్విరామంగా నాటిక పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. హాస్యం బాధలో నుంచి పుడుతుందన్నారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో సినీరంగంలో దాదాపు 33 ఏళ్ల పాటు 1100 పైగా చిత్రాల్లో నటించానన్నారు.  ఇన్నేళ్లు తనను ఆదరించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా బ్రహ్మానం దం అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో ఉన్నాడని ఇటీవల సోషల్‌ మీడియాలోవచ్చిన వార్తలు తనకు నవ్వు తెప్పిం చాయన్నారు. పదికోట్ల మంది తెలుగు ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు తన ను ఏ జబ్బులు ఏమీ చేయలేవన్నారు. ప్రేక్షకుల చప్పట్లే తనకు శ్రీరామరక్షని తెలిపారు. అనంతరం నాటక పోటీలను ప్రారంభించా రు. కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వ వ్వేరు బ్యాంకు చైర్మన్‌ సూరా శ్రీనివాసులురెడ్డి, కళాసాగర్‌ అధ్యక్షుడు దొడ్ల రమణయ్యయాదవ్, నేతలు టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, షేక్‌ అల్లాబక్షు, కలువ బాలశంకర్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, దువ్వూరు కల్యాణ్‌రెడ్డి, దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి పాల్గొన్నారు.

నా కర్తవ్యం నెరవేర్చా
‘‘పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనందుకు నా కర్తవ్యం నేను నెరవేర్చా’’నని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాళెంలోని వవ్వేరు బ్యాంకు ఆవరణలో గురువారం ప్రారంభమైన కళాసాగర్‌ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలన్న ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి తెలిపామన్నారు. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రపై ఉందన్నారు. అందుకే ప్రత్యేక హోదా కా వాలని కోరుతూ ఎంపీ పదవికి రాజీనా మా చేశానని వెల్లడించారు. కాగా 2019 ఎన్నికల సమయంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయన్నారు. రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు