భూముల సేకరణకు ఆదేశించాం

14 Mar, 2018 12:42 IST|Sakshi
సీసీఎల్‌ఏ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

జేసీ మల్లికార్జున

కాకినాడ రూరల్‌: పట్టణం, రూరల్‌ ప్రాంతా ల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చేలా భూములను సేకరించాలని ఆర్డీవోలను, తహసీల్దార్లను ఆదేశించినట్టు జాయింట్‌ కలñ క్టర్‌ ఎ.మల్లికార్జున వివరించారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్‌ఏ అనిల్‌చంద్ర పునేఠా స్పెషల్‌ ప్రాజెక్టులకు ఇళ్ల స్థలాలు, భూసేకరణ, నీటి పన్ను వసూలు, మీకోసంలో వచ్చిన సమస్యల పరిష్కారం, ఆర్థికేతర సమస్యల పరిష్కారం, జన్మభూమిలో వచ్చిన అర్జీల పరిష్కారం తదితర అంశాలపై జాయింట్‌ కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ కోసంలో వచ్చిన సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పునేఠా మాట్లాడుతూ భూమికి సంబంధించి వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం, కర్నూలు జిల్లాల  జాయింట్‌ కలెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్‌ రిజిస్టరు డాట్‌ లేండ్‌ వెంటనే పరిష్కరించాలన్నారు. రాజోలు బైపాస్‌ 216కి సేకరించిన భూములకు చెల్లింపులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ మల్లికార్జున రంపచోడవరం నుంచి పాల్గొనగా కాకినాడ కలెక్టరేట్‌ నుంచి ఇన్‌చార్జి డీఆర్వో ఎం.జ్యోతి, ఏవో జి.భీమారావు, ల్యాండ్‌ సర్వే ఏడీ నూతన్‌కుమార్, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

ప్రజాసాధికార సర్వేలో నమోదుకండి
ప్రజాసాధికార సర్వేలో అందరూ వివరాలు నమోదు చేయించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎ.మల్లికార్జున మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. 2016లో నిర్వహించిన సర్వేలో కొంతమంది ఇంటిలో లేకపోవడం, గ్రామం నుంచి పాక్షికంగా వలస వెళ్లటం, ఇతర కారణాల వల్ల వారి వివరాలు నమోదు కాలేదన్నారు. అలాంటి వారి వివరాలు సేకరించే నిమిత్తం వీఆర్వోవో, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్‌ సిబ్బంది ద్వారా గ్రామాల్లో నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించినట్టు తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయం, మున్సిపల్‌ కార్యాలయాల్లో వారం రోజులు నమోదు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు