మాచర్ల చెక్ పోస్టులో తనిఖీలు

29 Apr, 2015 09:36 IST|Sakshi

మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అంతర్రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్ట్ వద్ద బుధవారం ఉదయం జరిపిన సోదాల్లో 10 ధాన్యం లారీలను నిలిపివేశారు. ఈ లారీలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళుతున్నాయి. తనిఖీల్లో భాగంగా పన్నులు చెల్లించలేదని గుర్తించిన సిబ్బంది వాటిని నిలిపివేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా