ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న

10 Apr, 2020 15:38 IST|Sakshi

కరోనా కారణంగా  లాక్‌డౌన్‌ విధించడంతో మన తోటి మనుషులు ఎంతో మంది రోజుకు ఒక్క పూట కూడా ఆహారం దొరకక పస్తులు ఉంటున్నారు. లాక్‌డౌన్‌కి ముందు కష్టం చేసుకొని స్వశక్తితో బతికిన ఎంతో మంది వలసకూలీలు, దినసరి కూలీలు, నిరుపేదలు ఆకలితో నీళ్లు తాగి పడుకునే దుస్థితి దాపురించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను, వలస కూలీలను ఆదుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దీనికి తోడు సామాన్యులు సైతం ఈ సమయంలో ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. పేదలకు నిత్యవసర సరుకులు, ఆహారాన్ని అందిస్తున్నారు. అలా సాయం చేస్తున్న సామాన్యులు కొంతమంది సాక్షి.కామ్‌ ద్వారా వాళ్ల సేవ కార్యక్రమాన్ని తెలిపి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

అనుశ్రీ నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారి అధ్వర్యంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పొయిన వలస కూలీలకు, పేదలకు, దినసరి కూలీలకు గత మూడు రోజులుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోజుకు 500 మందికి అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన వారికి అసోసియేషన్‌ అధ్యక్షలు అంబటి నాగరాజు, ఉపాధ్యక్షులు రమేష్‌గౌడ్‌ శుభాకాంక్షలు తెలిపారు.  

మనమంతా గ్రూప్‌ వారు  లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న  4 ఆశ్రమాలకు కు కిరాణా సరుకులు, అద్దె ఖర్చులు అందించి సాయం చేశారు. సుధీర్ ఫౌండేషన్, హయత్ నగర్, మాతృ అభయ ఫౌండేషన్ , మేడిపల్లి,  సాయి సురక్షిత వృద్ధ ఆశ్రమం, ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమాలకు సాయం చేశారు. ఈ కార్యక్రమంలో  మనమంతా గ్రూపు ఫౌండర్ రవి,  జగదీష్ కుమార్ జల్లు, శేఖర్ ఉదయగిరి గారు, సుజాత గారు, రామాంజనేయులు, సునీత గారు, సుధాకర్ రెడ్డి, ఉష గారు సహాయ సహకారాలు అందించారు. ఇవే కాకుండా  మానసిక వికలాంగురాలి కోసం టీవీ, నెలకు సరిపడా ఆర్గానిక్ ఫుడ్స్ అందించారు. 

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పొయిన పేదలకు, నిరాశ్రయులకు కృష్ణజిల్లా గూడూరులో యతిరాజం గిడియోన్ తన వంతు సహాయాన్ని అందించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు బియ్యం, కంది పప్పు, వంట నూనె అందించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ, ట్రైనీ డీఎస్పీ శ్రావణి , బండారు తాలూకా సీఐ, గూడూరు ఎస్సై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో నాగరాజు, సోలమన్  తదితరులు పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా పూణేలో ఇరుక్కపోయిన యల్‌టీఐలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా  పనిచేస్తున్న కాయల రామకృష్ణుడు  తన సొంత గ్రామమైన కడపజిల్లా గంగాయపల్లిలో  పేదలకు కూరగాయలు, గుడ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో తనకు  సహాయం చేస్తున్న గ్రామ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  

ఖతర్‌లో ఉంటున్న కొణిజేటి శ్రీనివాసరావు తన స్వగ్రామమైన ఒంగోలులో ఉంటున్న వైద్యసిబ్భందికి 3560 మాస్క్‌లు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.  

బోడుప్పల్‌కి చెందిన శ్రీనివాసరావు వారి స్వచ్ఛంద సంస్థ జెరూషా ఫౌండేషన్‌ ద్వారా హైవేల పక్కన ఉంటున్న నిరాశ్రయులకు, లాక్‌డౌన్‌ కారణగా జీహెచ్‌యమ్‌సీ వారు ఏర్పాటు చేసిన షల్టర్స్‌లో ఉంటున్న వారికి పులిహోర, గుడ్లు పంపిణీ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని లాక్‌డౌన్‌ చివరి వరకు కొనసాగిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. 

చంద్రన్న పాలానికి చెందిన గెత్సమన్‌ ప్రార్థన సమూహము వారు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకి ఆహారాన్ని అందించారు. 

మణికొండలో లాక్‌డౌన్‌ కారణంగా ఆహారం అందక ఇబ్బంది పడుతున్న రోజువారీ కూలీలకు, పేదలు 100 మందికి నీలేష్‌ దుబే అన్నదానం చేశారు.  

నెల్లూరు జిల్లా పియ్యలపాలేం గ్రామంలో అరబిందో ఫార్మా లిమిటెడ్‌ రిప్రజెంటేటివ్‌ పీనక గోపినాథ రెడ్డి 315 కుటుంబాలకు కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా సెక్రటరీ పీనక శ్రీనివాసులు రెడ్డి, రమణయ్య, సురేంద్ర రెడ్డి, సుభాష్‌ రెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు