బలవంతపు భూ సేకరణ చేయలేరు...

3 Feb, 2016 01:11 IST|Sakshi
బలవంతపు భూ సేకరణ చేయలేరు...

 భోగాపురం: భోగాపురం వాసులకు అన్ని వేళలా అండగా నిలుస్తానని వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మంగళవారం ఉదయం విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తూ భోగాపురానికి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వా గతం పలికారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల ప్రజలు ఆయన రాక కోసం ఎ.రావివలస కూడలి వద్ద ఎదురు చూశారు. పార్టీ నాయకులు పెనుమత్స సాంబశివరాజు, కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, బెల్లాన చంద్రశేఖర్, పులిరాజు, కందుల రఘుబాబు, చనుమల్లు వెంకటరమణ, నెక్కల నాయుడుబాబు, అంబళ్ల శ్రీరాములునాయుడు తదితరులు కూడా ముందుగా కూడలి వద్దకు చేరుకున్నారు.


 జగన్‌కు స్వాగతం పలికేందుకు సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, మం డల కన్వీనరు దారపు లక్ష్మణరెడ్డి తదితరులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 10 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్న జగన్‌ను చూసేందుకు అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎస్‌ఐ దీనబంధు సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం కారు వద్దకు పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ కోలగట్ల వీరభద్రస్వామి, కందుల రఘుబాబులు వెళ్లి అధినేతకు కండువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అతి కష్టమ్మీద జనాల మధ్య నుంచి వేదిక వద్దకు తీసుకువచ్చారు.

పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, కాకర్లపూడి శ్రీనివాసరాజు ఎయిర్‌పోర్టు బాధిత రైతుల తరఫున జగన్‌కు నాగలిని బహుకరించారు. అభిమానులు పూ లవర్షం కురిపించారు. అలాగే ఏఎంసీ మాజీ చైర్మన్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి మెమొంటోను బహూకరించారు.

మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కండువా కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం జగన్ మాట్లాడారు. బాధిత గ్రామ ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని సూచిం చారు. ఐక్యంగా ఉండి న్యాయపోరాటం చేసినందునే స్టే లభించిందని తెలిపారు. ఇలాగే పోరాడితే విజయం తథ్యమని చెప్పారు.

అనంతరం దూరంగా ఉన్న మహిళలను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా మాట్లాడారు.కార్యక్రమంలో పార్టీ డెంకాడ మండల కన్వీనరు బంటుపల్లి వాసుదేవరావు, మండల నాయకులు రావాడ బాబు, వరుపుల సుధాకర్, దాట్ల శ్రీనివారాజు, భెరైడ్డి ప్రభాకరరెడ్డి, ఎర్ర అప్పలనారాయణ రెడ్డి, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, పతివాడ అప్పలనాయుడు, జైహింద్‌కుమార్, మారం బాలబ్రహ్మారెడ్డి, రెడ్డి బంగారునాయుడు, ఉప్పాడ సూర్యనారాయణ, బీఎల్ రెడ్డి, ఎస్‌ఈవీ రాజేష్, ఆశపు వేణు, నడిపేన శ్రీనివాసరావు, జీవీ రంగారావు, అల్లు చాణక్య, శీరపు గురునాధరెడ్డి, ఉప్పాడ శివారెడ్డి, సవరవిల్లి శ్రీనివాసరావు, దల్లి శ్రీను, కొల్లి రామ్మూర్తి, పట్న తాతయ్య, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు