నష్టపరిహారం అందించడంలో అవకతవకలు

25 Oct, 2018 11:10 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టపరిహారం అందించడంలో అవకతవకలు జరుగుతున్నాయని బాధితులు గొల్లుమంటున్నారు. బాధితుల జాబితాను తయారు చేసేందుకు వచ్చిన పరిశీలన బృందం అర్హుల జాబితాలో తప్పులు ఉండటంతో గ్రామస్థులు అధికారులను నిలదీస్తున్నారు. సమగ్ర సర్వే లేకుండా హడావుడిగా జాబితాలు రూపొందించడం వల్ల బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. పదిహేను రోజులైనా 85 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్దరణ కాలేదని ప్రజలు వాపోతున్నారు. పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా ఇవ్వకపోవడంతో పలాసలో జీడిపరిశ్రమల కార్మికులు ఆందోళన చేపట్టారు. తుపానుకు నేలకూలిన చెట్లను కూడా తొలగించలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. 

మరిన్ని వార్తలు