‘సాధినేని యామినిని అరెస్ట్‌ చేయాలి’

10 Jun, 2019 20:05 IST|Sakshi
సాధినేని యామిని

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభ్యంతరకర ట్వీట్ చేశారంటూ టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై ఫిర్యాదు నమోదైంది. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్ సోమవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాధినేని యామినిని అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. యామిని వ్యాఖ్యలు టీడీపీ సంస్కృతికి అద్దం పడుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఇష్టానుసారం నోరుపారేసుకొంటున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.

మరిన్ని వార్తలు