జిల్లాలో ఫిర్యాదు బాక్స్‌లు.. వేధింపులపై ఉక్కుపాదం

18 Jun, 2019 16:58 IST|Sakshi

సాక్షి, తిరుపతి(చిత్తూరు) : రాష్ట్రంలో మహిళలపై వేధింపులు అధికమవుతున్న నేపథ్యంలో.. చిత్తూరు జిల్లాలో పోలీసులు నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సలహాపై జిల్లా మొత్తం ఫిర్యాదు బాక్స్‌లను అమర్చారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్‌ ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులకు మధ్య మెరుగైన సంబంధాలు ఏర్పడాలనే ఉద్దేశంతో జిల్లా పరిధిలో మొత్తం 95 ఫిర్యాదు బాక్స్‌లను ఏర్పాటు చేశామని, జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ  బాక్స్‌లను  ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.

రద్దీ ప్రదేశాలైన పాఠశాలలు, బస్టాండ్స్‌, మార్కెట్‌, ఆలయాలు వంటి ప్రాంతాలతోపాటు, ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో 5  ఫిర్యాదు బాక్స్‌లను అమర్చారని పేర్కొన్నారు. వీటి పర్యవేక్షణ పూర్తిగా స్పెషల్‌ బ్రాంచ్‌ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఫిర్యాదు బాక్స్‌లను తెరిచి ఫిర్యాదులను ఎస్పీ గారికి తెలియజేస్తామని, అంతేకాక  వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు