బెజవాడలో కత్తులతో విద్యార్థుల వీరంగం

31 May, 2020 11:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: బెజవాడలో కాలేజీ విద్యార్థులు రౌడీ మూకల్లా చెలరేగిపోయారు. నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు పాల్పడే దాకా వెళ్లింది. దీంతో బెజవాడ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దాడిలో గాయపడిన వారిని నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. గ్యాంగ్‌వార్‌లో రాజకీయ పార్టీ నేతల అనుచరులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చదవండి: బాసర ట్రిపుల్‌ ఐటీలో అగ్నిప్రమాదం 

మరిన్ని వార్తలు