పేర్లు...ఎక్కిత్తాండ్లు

7 Jan, 2014 02:28 IST|Sakshi
పేర్లు...ఎక్కిత్తాండ్లు
  •  కాంగ్రెస్‌లో ఎన్నికల సందడి
  •  వారంలో జిల్లాకు అధిష్టానం పరిశీలకుల రాక
  •  అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అభ్యర్థుల జాబితా
  •  ప్రతి నియోజకవర్గానికి ముగ్గురి పేర్ల సేకరణ
  •  ఆశావహుల్లో ఉత్కంఠ
  •  
    అధికార కాంగ్రెస్‌లో అప్పుడే అభ్యర్థుల వేట ప్రారంభమైంది. జిల్లాలో  అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోటీకి సమర్థులైన నాయకుల పేర్లను సేకరించేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. ఏఐసీసీ నిర్ణయం మేరకు త్వరలో జిల్లాకు పరిశీలకులు రానున్నారు. ముఖ్య నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరిం చనున్నారు. ఈ నేపథ్యంలో హస్తం శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
     
    సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వేడి మొదలైంది. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సరైన అభ్యర్థుల కోసం పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి జరగనున్న ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీపై ఉన్న వ్యతిరేకతను తట్టుకుని నిలువగలిగే అభ్యర్థుల కోసం అధిష్టానం దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే సమర్థులైన అభ్యర్థుల జాబితా రూపకల్పనకు  కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వేడి మొదలైంది. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సరైన అభ్యర్థుల కోసం పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి జరగనున్న ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీపై ఉన్న వ్యతిరేకతను తట్టుకుని నిలువగలిగే అభ్యర్థుల కోసం అధిష్టానం దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే సమర్థులైన అభ్యర్థుల జాబితా రూపకల్పనకు లోక్‌సభ నియోజకవర్గానికి ఒకరు చొప్పున పరిశీలకులను పంపించాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) నిర్ణయించింది.

    వరంగల్, మహబూబాబాద్, భువనగిరి లోక్‌సభ స్థానాల పరిశీలకులు మరో నాలుగు రోజుల్లో జిల్లాకు వచ్చి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోటీకి సమర్థులైన నాయకుల పేర్లను సేకరించనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు చొప్పున పేర్లతో ఈ పరిశీలకులు జాబితా రూపొందించి కాంగ్రెస్ అధిష్టానానికి నివేదించనున్నారు. నియోజకవర్గంలోని సామాజిక పరిస్థితులు, ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు, ఏ పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ప్రజల్లో ఇప్పుడున్న పరిస్థితి వంటి అంశాలపై శ్రేణులు, ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు.

    కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లోనూ ఈ పరిశీలకులు మూడు పేర్ల చొప్పున జాబితా రూపొందించనున్నారు. కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో ఈ పని ఇప్పటికే మొదలైంది. మన జిల్లాలోకు సంక్రాంతిలోపే పరిశీలకులు వచ్చి వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అనుసరించే వ్యూహం ఖరారు ప్రధాన ఎజెండగా జనవరి 17న ఏఐసీసీ సదస్సు జరగనున్న నేపథ్యంలో సంక్రాంతి లోపు కాకుంటే.. ఈ సదస్సు తర్వాత పరిశీలకులు జిల్లాలకు రాానున్నారని పేర్కొంటున్నారు.

    లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఖరారు కోసం ఆరు నెలల క్రితమే రాహుల్‌గాంధీ దూతలు వచ్చి వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థుల పేర్ల సేకరణ ప్రధానంగా ఉంటుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ పరిశీలకులు రావడం ఖరారైన నేపథ్యంలో జాబితాలో తమ పేరు ఉంటుందా ఉండదా అనే అంశంపై కాంగ్రెస్ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికలలోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం ఖామయని కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం కోసం ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు.  
         
    ఏఐసీసీ పరిశీలకులు రూపొందించే జాబితాలో కచ్చితంగా మూడు పేర్లు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జనగామలో పొన్నాల లక్ష్మయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ అనుకూల పరిస్థితులు ఉన్నా గత ఎన్నికల్లోనూ కష్టంగా గెలిచారు. ఇక్కడ.. పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం పేర్లు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది.
         
    వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బస్వరాజు సారయ్యకు తిరుగులేకున్నా అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు హరి రమాదేవి, పొద్దుటూరి రామేశ్వరరెడ్డి, ఎంబాడి రవీందర్‌లు ఆసక్తితోనే ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
         
    కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి ఇంచార్జీగా ఉన్న నర్సంపేటలో మరో రెండు పేర్లు ఎవరివి ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. దొంతి మాధవరెడ్డికి ఇక్కడ అభ్యర్థిత్వం ఖాయమనే కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జాబితాలో మూడు పేర్లు ఉండాలనే నిబంధన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రామసాయం రఘురామిరెడ్డి, వి.రాజవర్ధన్‌రెడ్డిలు ఆసక్తి చూపిస్తున్నారు.
         
    భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరారెడ్డికి అభ్యర్థిత్వం విషయంలో తిరుగు ఉండదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ముగ్గురు పేర్లతో ఉండే జాబితాలో మాత్రం గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, కొండా మురళీధర్‌రావుల పేర్లు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
         
    వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన కొండపల్లి దయాసాగర్, జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీబీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, పార్టీ నేత బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ గంటా నరేందర్‌రెడ్డిలు జాబితాలో పేరు కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.
         
    పరకాల నియోజకవర్గ అభ్యర్థిత్వం కోసం రూపొందించే జాబితాలో మాజీ మంత్రి కొండా సురేఖ, సాంబారి సమ్మారావు, ఇనుగాల వెంకటరామిరెడ్డి, గండ్ర జ్యోతిలలో మూడు పేర్లు ఉండే అవకాశం ఉంది.
         
    పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉండనుంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దుగ్యాల శ్రీనివాసరావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ లకావత్ ధన్వంతి, లకావత్ లక్ష్మీనారాయణ, రామసాయం రఘురామిరెడ్డి పేర్లు జాబితాలో ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
         
    స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజారపు ప్రతాప్, మాజీ మంత్రి జి.విజయరమారావు, జి.అమృతరావు, బి.ఆరోగ్యం పేర్లు జాబితాలో ప్రధానంగా ఉండనున్నాయి.
         
    వర్ధన్నపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌కు అవకాశాలు ఖాయమని ఆయన వర్గం ధీమాతో ఉంది. ఎమ్మెల్యేతోపాటు జాబితా లో పేరు కోసం కాంగ్రెస్ నేతలు బక్క జడ్సన్, నమిళ్ల శ్రీనివాస్‌లు ప్రయత్నిస్తున్నారు.
         
    డోర్నకల్ నియోజకవర్గం జాబితాలో మాజీ మం త్రి డీఎస్ రెడ్యానాయక్‌కు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిత్వం విషయంలో పోటీ లేదని స్థానిక శ్రేణులు చెబుతున్నాయి. ముగ్గురు జాబితాలో చేర్చే పేర్లు కూడా ఉండవని మాజీ మంత్రి వర్గీయులు చెబుతున్నారు. రెడ్యానాయక్‌కు చెక్ పెట్టేందుకు కేం ద్ర మంత్రి పోరిక బలరాంనాయక్ ఇక్కడ కొత్త వారిని బరిలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు.
         
    మహబూబాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాలోత్ కవిత, మహబూబాబాద్ మాజీ సర్పంచ్ భూక్య నెహ్రూనాయక్, గుగులోత్ సుచిత్రనాయక్ పేర్లు ఉంటాయని స్థానికంగా చర్చించుకుంటున్నారు.
         
    ములుగు నియోజకవర్గం జాబితాలో.. గత ఎన్నికల్లో పోటీ చేసిన పోదెం వీరయ్య, పాయం మానేశ్వర్‌రావు, నూనావత్ సారయ్యనాయక్ పేర్లు ఉండే పరిస్థితి ఉంది.  
     

>
మరిన్ని వార్తలు