కాంగ్రెస్, టీడీపీలదే విభజన పాపం

7 Jan, 2014 03:30 IST|Sakshi

నగరి, న్యూస్‌లైన్: రాష్ట్రం విడిపోతే ఆ పాపం కాంగ్రెస్, టీడీపీలకే చెందుతుందని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు రోజా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అంశంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరి స్తున్న తీరుపై ఆమె మండిపడ్డారు. నగరిలోని టవర్‌క్లాక్ సెంటర్ వద్ద స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారం మానవహారం నిర్వహించారు. ఒకే భాష, ఒకే రా ష్ట్రం అంటూ నినాదాలు హోరెత్తించా రు. రోజా మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుందని విమర్శించారు.

విభజన జరిగితే ప్రజలు నష్టపోతారని వైఎస్‌ఆర్‌సీపీ చెబుతున్నా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీని కాపాడుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని తెలిపారు. సమైక్య రాష్ర్టం కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజేకుమార్, పార్టీ రూరల్ మండల కన్వీనర్ భాస్కర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కేజేసురేష్, టీకే హరిప్రసాద్, జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి రహీం, మైనారిటీ కన్వీనర్ ఎన్.ఎం.బాషా, స్థానిక నాయకులు బీఆర్వీ అయ్యప్పన్, కన్నాయిరం, గోవర్దన్, నాగరత్నం, ధనపాల్‌రెడ్డి, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు