లారీ ఢీకొని కానిస్టేబుల్ మృతి

1 May, 2016 08:49 IST|Sakshi

నెల్లూరు : నెల్లూరు జిల్లా మనుబోలు పోర్టు క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆదివారం లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం కోసం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు