24 గంటల్లో 6 టీఎంసీలు

20 Jul, 2020 04:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శ్రీశైలం ప్రాజెక్టుకు స్థిరంగా వరద ప్రవాహం

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/నందికొట్కూరు: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణా నది వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆది వారం సాయంత్రం ఆరు గంటలకు నీటి నిల్వ 66.01 టీఎంసీలకు చేరుకుంది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి.. ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకూ శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆరు టీఎంసీలు వరద ప్రవాహం చేరడం గమనార్హం. పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాలో ఎగువన వరద ప్రవాహం పెరిగింది.  

► ప్రకాశం బ్యారేజీలోకి 9,347 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు 6,290 క్యూసెక్కులు వదిలి 3,057 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 
► ధవళేశ్వరం బ్యారేజీలోకి గోదావరి జలాలు 56,039 క్యూసెక్కులు చేరుతుండగా 44,039 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 
► కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర క్షేత్రాన్ని ఆదివారం సాయంత్రం కృష్ణా జలాలు చుట్టేశాయి. ఆలయం కూడా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతోంది. 

మరిన్ని వార్తలు