తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు:బొత్స

16 Aug, 2013 15:17 IST|Sakshi
తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు:బొత్స

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి ప్రక్రియ ఆగిపోలేదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం తెలంగాణ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన బొత్స ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదంటూనే, రాష్ట్ర విభజనకు రాజ్యాంగ ప్రక్రియ అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటైన ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధిచినది మాత్రమేనన్నారు.

 

 గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులతో భేటీ అయిన బొత్స సత్యనారాయణ.. విభజన ప్రక్రియ నడుస్తోందని, ఆంటోని కమిటీ వల్ల దానికి ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ నెల 19న ఆంటోనిని రెండోసారి కలవనున్న తెలంగాణ నేతలు.. సీడబ్యూసీ తీర్మానాన్ని యధావిధిగా అమలు చేయాలని, విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ నెల 18న తెలంగాణ  జిల్లాల్లో మంత్రుల, ఎమ్మెల్యేల విస్తృతస్థాయి సమావేశం ఉంటుందన్నారు. అయితే.. మంత్రి దానం నాగేందర్‌ మాత్రం భిన్న స్వరం వినిపించారు.  హైదరాబాద్‌పై చాలా అనుమానాలు ఉన్నాయని.. రాజధాని సమస్యలపై అంటోనీ కమిటీని ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నట్లు చెప్పారు దానం.  ఈ నెల 20న సీమాంధ్ర నేతలు ఆంటోనీ కమిటీని కలుస్తారని పీసీసీ చీఫ్‌ బొత్స చెప్పారు

 


 

>
మరిన్ని వార్తలు