అరకులో కాంట్రాక్టు ఉద్యోగుల మెరుపు సమ్మె

7 Dec, 2014 17:07 IST|Sakshi

అరకు: ప్రముఖ పర్యాటక ప్రాంతం విశాఖపట్నం జిల్లా అరకులో కాంట్రాక్టు ఉద్యోగులు ఆదివారం మెరుపు సమ్మకు దిగారు. 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు సమ్మె చేపట్టారు.

మ్యూజియం, పద్మావతి గార్డెన్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అరకు అందాలను తిలకిద్దామని వచ్చిన పర్యాటకులకు ఉద్యోగుల సమ్మెతో నిరాశ ఎదురైంది.

మరిన్ని వార్తలు