దుర్గమ్మ హుండీ లెక్కింపులో చోరీ!

19 Feb, 2015 18:06 IST|Sakshi

కనకదుర్గ దేవస్థానం హుండీ లెక్కింపుల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. దేవస్థానంలో ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీలను లెక్కిస్తారు. దీనిలో భాగంగానే హుండీ కలెక్షన్లను లెక్కిస్తుండగా ఓ ఉద్యోగి అమ్మవారికి భక్తులు కానుకగా సమర్పించిన బంగారు మంగళసూత్రాలను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు.

సీసీటీవీ ఫుటేజి ఆధారంగా అతడిని ఆలయ అధికారులు గుర్తించారు. కాంట్రాక్టు సిబ్బంది సుబ్బారావు టీ కప్పులో నాలుగు గ్రాముల బరువున్న మంగళ సూత్రాలను వేసుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఎస్పీఎఫ్ సిబ్బంది సీసీటీవీలో గుర్తించి అతడిని పట్టుకున్నారు. మొదట ఆలయ అధికారులు అతడిని విచారించి, తర్వాత విజయవాడ వన్టౌన్ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు