బొలేరోను ఢీకొన్న లారీ : కాంట్రాక్టర్ మృతి

6 Feb, 2014 08:29 IST|Sakshi

చిత్తూరు జిల్లా పాకాల మండలం పదిపెట్లబైలు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ ఘటనలో బొలేరోలో ప్రయాణిస్తున్న కాంట్రాక్టర్ మల్లిఖార్జున నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లిఖార్జున నాయుడు మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. మృతుడు మల్లిఖార్జున నాయుడు రొంపిచర్ల మండలం దద్దాలవారిపల్లెకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు