కాంట్రాక్టర్ల రింగ్

11 Oct, 2013 03:52 IST|Sakshi

=      ధాన్యం రవాణా టెండర్లలో గోల్‌మాల్
=     అధికారులకు చిక్కకుండా అడ్డదారులు
=    అన్నింటికీ సింగిల్ టెండర్లే
=     మహిళా సంఘాల వాటికీ గాలం

 
వరంగల్, న్యూస్‌లైన్ : ధాన్యం రవాణా టెండర్లలో కాంట్రాక్టర్లు రింగయ్యారు. కొత్తవారిని రానీయకుం డా అడ్డుకుని... బేరసారాలు నడిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు తగ్గకుండా... హెచ్చు ధరలకే దక్కించుకునేందు కు సఫలీకృతులయ్యారు. 10 డివిజన్లకు పిలిచినా అన్నింటికీ ఒక్కటీ, రెండు టెండర్లు మా త్రమే దాఖలయ్యాయి. జిల్లాలో త్వరలో ప్రా రంభమయ్యే ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా చేసేందుకు ఈనెల 1న టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. జేసీ కార్యాలయంలో ఈనెల 2 నుంచే సీల్డ్ టెండ ర్లు స్వీకరించారు.

ఎనిమిది రోజుల నుంచి ఒక్క టెండరూ దాఖలు కాలేదు. గురువారం ఆఖరి రోజు కావడంతో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. దీంతో టెండరు దాఖలు చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లు రిం గయ్యారు. గురువారం సాయంత్రం వరకు టెండర్ల స్వీకరణ ముగిసింది. మొత్తం దాఖ లైన టెండర్లను ఈనెల 17న తెరువనున్నారు. 0.2 కిలోమీటరు నుంచి 16 కిలోమీటర్ల వర కు ఒక్క టన్నుకు రూ.185, ఈ తర్వాత ప్రతీ పది కిలోమీటర్లకు ఒక్క టన్నుకు రూ.365 చెల్లిం చేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.

దీనికోసం టెండర్లను పిలిచారు. 65 టన్నుల లారీలున్న ట్రాన్స్‌ఫోర్ట్ కంపెనీలకు అర్హతగా ప్రకటించారు. సీల్డ్ టెండరు వేయాలని, టెండరు సమయంలో రూ.5వేలు డీడీ చెల్లించాలని నిబంధనలు విధించారు. టెండ రు దక్కితే రూ.4 లక్షలు ప్రభుత్వానికి డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
 
అంతా  కలిసిపోయారు..


టెండర్లను దక్కించుకునేందుకు గతంలో పని చేసిన కాంట్రాక్టర్లు ఒక్కటయ్యారు. దీని లో కూడా రాజకీయ ప్రోద్భలం చోటు చేసుకోం ది. అధికార పార్టీ నేతలతో పైరవీ చేయిం చారు. కొత్తగా టెండర్ వేసేందుకు వచ్చిన వారిని ముందుగా బెదింరించి... ఆ తర్వాత ప్రలోభాలకు గురిచేశారు. టెండర్లు పట్టుకుని వచ్చిన వారికి తలా కొంత మొత్తం చేతిలో పెట్టి... సింగిల్ టెండర్లకు రింగయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రూపాయి తగ్గకుండా టెండర్లు దాఖలు చేశారు. ములు గు ప్రాంతం నుంచి వచ్చిన ఓ కాంట్రాక్టర్‌ను టెండరు దాఖలు చేసే కార్యాలయం వద్దే బహిరంగంగా బెదిరింపులకు గురిచేశారు. వారి బెదిరింపులకు భయపడి టెండరు వేయకుండానే వెనుదిరిగారు.

దీంతో పది డివిజ న్లకు ఒక్కటి... రెండు టెండర్లే దాఖలయ్యా యి. మొత్తం పది డివిజన్లలో రెండు డివిజన్లలకు మహిళా సంఘాలకు కేటాయించారు. వాటిలో కూడా కాంట్రాక్టర్ల ఆధిపత్యమే నడిచింది. సంఘాలను వేయనీయకుండా కాం ట్రాక్టర్లే ఒక్కరితోనే టెండరు వేయించారు. ములుగు-1 డివిజన్, జనగామ-2 డివిజ న్లను మహిళా సంఘాలకు కేటాయించగా వాటికి ఒక్కొక్క టెండరు మాత్రమే దాఖలైం ది. అదే విధంగా మహబూబాబాద్-1 డివిజ న్‌కు 2 టెండర్లు, మహబూబాబాద్-2కు 2 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి.

ములుగు-1కు సింగిల్ టెండరు వేశారు. ములుగు-2కు 2 టెండర్లు, ములుగు-3లో 2, వరంగల్-1కు సింగిల్ టెండరు, వరంగల్-2 డివిజన్‌కు 2 టెండర్లు దాఖలయ్యాయి. అదే విధంగా జనగామ-1 డివిజన్‌కు 2, జనగామ-2కు సింగిల్ టెండరు వేశారు. నర్సంపేట డివిజన్‌కు 2 టెండర్లు దాఖలు చేశారు. రెండు టెండర్లు దాఖలైన డివిజన్లలో ఒక్క కాంట్రాక్టరే రెండేసి టెండర్లు వేశారు. మొత్తానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రూపాయి తగ్గకుండా పూర్తిస్థాయిలో దక్కించుకునేందు కు వేసుకున్న ఎత్తులన్నీ ఫలించాయి.
 

మరిన్ని వార్తలు