జిల్లాలో వైద్యరంగం అభివృద్ధికి కృషి

14 Jun, 2014 03:14 IST|Sakshi
  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు
  •  చిత్తూరు(జిల్లాపరిషత్): చిత్తూరు జి ల్లాలో వైద్యరంగం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీని వాసరావు అన్నారు. శుక్రవారం ఉద యం కాణిపాకం వరసిద్ధి వినాయకు ని దర్శనానికి వచ్చిన ఆయన తిరు గు ప్రయాణంలో చిత్తూరు చేరుకున్నారు.

    ఈ సందర్భంగా ఆయనను చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే శివప్రసా ద్, సత్యప్రభతో పాటు, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, మాజీ ఎం పీ దుర్గారామక్రిష్ణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, చిత్తూ రు సహకార చక్కెర కర్మాగారం అధ్యక్షులు ఎన్పీ రామకృష్ణ, బీజేపీ నాయకులు బాబుప్రసాద్‌రెడ్డి కలసి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ బెంగళూరు, చెన్నైకు మధ్య చి త్తూరు జిల్లా ఉందని, నిత్యం తిరుమలకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారని తెలిపారు.

    ఈ క్రమం లో ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు జరి గే అవకాశం ఉందని, దీనిని అధిగమించి క్షతగాత్రులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిని పేదప్రజలకు ఉపయోగపడేలా సిద్ధం చేయాల్సి ఉందన్నారు. దీనికి గాను జిల్లాలోని ఎమ్మెల్యేలం తా సమావేశమై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి కోరారు. జిల్లాలో మండల స్థాయిలో ని ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, వీటిని సరి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

    ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినందున అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా చిత్తూరుకు చెందిన బీజేపీ నాయకు లు మంత్రిని కలసి చిత్తూలోని ప్రభు త్వ ప్రధాన వైద్యశాల సూపరింటెం డెంట్‌ను విధుల నుంచి తప్పించాల ని డిమాండ్ చేశారు.

    సూపరింటెం డెంట్ డాక్టర్ దేవదాసు అండతోనే ఆస్పత్రిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆపార్టీ నాయకు లు రామభద్ర, అట్లూరిశ్రీనివాసు లు, దేవేంద్ర, ఆరణి తదితరులు జిల్లా కార్యదర్శి వెంకటేశ్ ఆధ్వర్యం లో మంత్రికి వినతిపత్రం సమర్పిం చారు. అనంతరం మంత్రి బీజేపీ నాయకురాలు స్వర్గీ య ఝాన్సీలక్ష్మీ ఇంటికి వచ్చారు. ఆమె కుమారుడు వెంకట్, కుటుం బీకులను కలసి వారి ఆతిధ్యాన్ని స్వీకరించారు.
     

మరిన్ని వార్తలు