'పశ్చిమ' అధికారులు అప్రమత్తం

9 May, 2014 14:11 IST|Sakshi

ఏలూరు : రాబోయే 48 గంటలపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ...అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ తీరప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. అలాగే ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 కేరళ ఉత్తర తీరం వద్ద ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్ధిరంగా కొనసాగుతోందని విశాఖ లోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం 24 గంటల్లో క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా పయనించే అవకాశముందని అధికారులు తెలిపారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్రల్లో మరో 48గంటల వరకు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
 

>
మరిన్ని వార్తలు