హెచ్పీసీఎల్ బాధితుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు

24 Aug, 2013 10:30 IST|Sakshi

నగరంలోని హెచ్‌పీసీఎల్ సంస్థకు చెందిన రిఫైనరీలో నిన్న సాయంత్రం చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ శనివారం  సందర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఉన్నతాధికారులనడిగి తెలుసుకున్నారు. హెచ్పీసీఎల్ ప్రమాద ఘటన వివరాలకు సంబంధించి విశాఖపట్నంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ఆ ప్రమాద ఘటనలో మరణించిన, గాయపడిన వారి వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్180042500002 ఫోన్ చేయాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య శనివారం ఉదయానికి నాలుగుకు చేరింది. అయితే ఆ ప్రమాదంలో గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 36 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు